Free Training for Unemployed Youth : నిరుద్యోగ యువ‌త‌కు కంప్యూట‌ర్‌, ట్యాలీ నైపుణ్యంపై ఉచిత శిక్ష‌ణ‌..

గుంటూరు: ఉన్నతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగళూరులో కంప్యూటర్‌, ట్యాలీ నైపుణ్యంపై ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్‌ ప్రతినిధి హరిప్రసాద్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, డిప్లమా, డిగ్రీ పాస్‌, ఫెయిల్‌ అయిన 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు గల అభ్యర్థులకు బెంగళూరులో 35 రోజుల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ ఇస్తామని వెల్లడించారు.

D Pharmacy : డీ ఫార్మ‌సీతో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు..

ట్యాలీ ప్లస్‌ జీఎస్టీ, స్పోకెన్‌ ఇంగ్లిషు, కంప్యూటర్‌, కమ్యూనికేషన్‌, లైఫ్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌తోపాటు వర్క్‌ప్లేస్‌ ఎథిక్స్‌పై అత్యుత్తమ శిక్షణ ఇచ్చి, శిక్షణానంతరం వివిధ సంస్థల్లో నెలకు రూ.15వేలకుపైబడిన వేతనంతో నూరు శాతం ఉద్యోగాలను చూపిస్తామని వివరించారు. ఇతర వివరాలకు 90004 87423 నంబర్లో సంప్రదించాలని సూచించారు.

Road Transport Corporation: ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం.. అంత్య‌క్రియ‌ల వ్య‌యం పెంపు.. ఎంతంటే..

#Tags