Skill Hubs: స్కిల్‌ హబ్‌లో ఉచిత కోర్సులతోపాటు ఉద్యోగావకాశాలు..

ఉద్యోగం చేయాలనే తపన ఉన్నా సరైన నైపుణ్యం లేక ఉద్యోగ వేటలో వెనుకబడిపోతుంటారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేసింది.

శుభపరిణామం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ సెంటర్లలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ కోర్సు పూర్తి చేసిన వారికి వంద శాతం ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే కోర్సు పూర్తి చేసిన వారు పేరొందిన కంపెనీలలో పనిచేస్తున్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను స్కిల్‌ హబ్‌ సెంటర్లు చూపిస్తున్నాయి. త్వరలోనే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం శుభపరిణామం. దీంతో మాలాంటి ఎంతో మంది వృత్తి నైపుణ్యం పొందుతారు.

– నితీష్‌,

శిక్షణ పొందుతున్న అభ్యర్థి, వెంకటగిరి

Sakshi Spell- B Exam Conducted- సాక్షి స్పెల్‌-బీ పరీక్షకు విశేష స్పందన

ఉపాధి కల్పనకే..

జిల్లాలో ప్రస్తుతం ఉన్న స్కిల్‌ హబ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వంద శాతం ఉపాధి లభిస్తుంది. ప్రధానంగా డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సు పూర్తి చేసి అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలలో చేరుతున్నారు. దీంతో పాటు భవన నిర్మాణం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగాలకు సంబంధించి తిరుపతిలోని స్కిల్‌ హబ్‌ సెంటర్లలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు.

– లోకనాథం,

జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, తిరుపతి

Essay Competitions: విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

ప్రతి వ్యక్తికి ఉన్నత ఉద్యోగంలో స్థిర పడాలనే కోరిక ఉంటుంది. గత ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను పట్టించుకోకపోవడం వల్ల మధ్యలోనే చదువులకు స్వస్తి చెప్పినవారు కోకొల్లలు. చాలా మంది పదోతరగతి, ఇంటర్మీడియట్‌ వరకు మాత్రమే చదువుకుని ఇంటికే పరిమితమై ఉన్నారు. ఉద్యోగం చేయాలనే తపన ఉన్నా సరైన నైపుణ్యం లేక ఉద్యోగ వేటలో వెనుకబడిపోతుంటారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేసింది. జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఏడు స్కిల్‌ హబ్‌ సెంటర్లు నెలకొల్పింది.

Microsoft Job: మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌.. ఏడాదికే షాక్‌..!

ప్రస్తుతం ఆయా సెంటర్లలో సుమారు 5వేల మందికి పైగా పలు కోర్సులలో శిక్షణ పొందుతున్నారు. తిరుపతిలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్‌లైడ్‌ న్యూట్రీషన్‌ స్కిల్‌ కళాశాలలో స్వల్ప కాలిక హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(నాక్‌)లో ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ సెంటర్లలో ఎలక్ట్రీషియన్‌, ఫ్లంబింగ్‌, టైలరింగ్‌, నిర్మాణ రంగానికి సంబంధించిన కోర్సులలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఎస్వీ పాలిటెక్నిక్‌ ప్రభుత్వ ఐటీఐ లోని స్కిల్‌ హబ్‌ సెంటర్లలో డొమెస్టిక్‌ డెటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సుల్లో యువతీ యువకులకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు.

KU: పీజీ సెమిస్టర్‌ పరీక్షలు తేదీలు ఇవే..

డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు పెరిగిన డిమాండ్‌

ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌ సెంటర్లలో ఇంటర్మీడియట్‌ కనీస అర్హతగా డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. ఉపాధే లక్ష్యంగా డిగ్రీ పూర్తి చేసిన యువత సైతం ఈ కోర్సులలో శిక్షణ పొందుతున్నారు. ఇందులో కంప్యూటర్‌ వినియోగం, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంగ్లిష్‌, తెలుగు టైపింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్‌ అందిస్తున్నారు. అనంతరం ప్రభుత్వ అనుబంధ, ప్రైవేటు సంస్థలలో ఉపాధి కల్పిస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు పేరొందిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీలలో ఉద్యోగఅవకాశాలు పొందుతున్నారు. రూ.12వేలు నుంచి రూ.18వేల వరకు ప్రారంభ వేతనం అందుకుంటున్నారు. నైపుణ్యం, సీనియారిటీని ఆధారంగా వేతనాలు మరింత పెరిగే అవకాశముటుంది. ప్రస్తుతం ఈ కోర్సుకు డిమాండు పెరిగింది.

KU: పీజీ సెమిస్టర్‌ పరీక్షలు తేదీలు ఇవే..

త్వరలోనే స్కిల్‌ వర్సిటీ

ఏర్పేడు మండలం కోబాక గ్రామం వద్ద ఏపీ స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు 50ఎకరాలను సేకరించారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

నాణ్యమైన శిక్షణ

నేను ఇంటర్‌ పూర్తి చేసి స్కిల్‌ హబ్‌ సెంటర్‌లో డొమెస్టిక్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ కోర్సులో చేరా. ఇక్కడ కంప్యూటర్‌ ఆపరేటింగ్‌, ఇంగ్లిష్‌, తెలుగు టైపింగ్‌, ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌లో ఉచితంగా నాణ్యమైన శిక్షణ ఇస్తున్నారు. గతంలో లాగా ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో కాకుండా ప్రభుత్వ కళాశాలలోనే అధ్యాపకుల ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. స్కిల్‌ సెంటర్‌ ద్వారా ఎమ్‌ఎన్‌సీ కంపెనీలలో ఆపరేటర్‌ ఉద్యోగం కల్పిస్తుండడం సంతోషకరం. – అయేషా,

శిక్షణ పొందుతున్న అభ్యర్థి, వెంకటగిరి

#Tags