IT Jobs Layoff: గడ్డు కాలంలో ఐటీ ఉద్యోగులు... భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ హెడ్‌కౌంట్!

6,940 మంది ఉద్యోగులు ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి.

కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించినప్పటి నుంచి ఐటీ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ ప్రభావం ఇప్పటికి కూడా అలాగే ఉండటం గమనార్హం. కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగుల వేతనాలను పెంచకపోగా.. మరి కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. తాజాగా 'ఇన్ఫోసిస్' (Infosys) ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో చాలా మంది ఎంప్లాయిస్ సంస్థను వీడి వెళ్లినట్లు తెలిసింది.

Developers will lose jobs: సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ల‌కు గ‌డ్డురోజులే... రానున్న‌ రెండేళ్ల‌లో ప్రోగ్రామ‌ర్ల ఉద్యోగాల‌కే ఎస‌రు..!

ఇన్ఫోసిస్ నికర లాభం, ఆదాయం వంటివి మునుపటికంటే కూడా కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ 2023 ఏప్రిల్ & జూన్ సమయంలో ఏకంగా 6,940 మంది ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం సంస్థలో 3,36,294 మంది ఉన్నట్లు సమాచారం.

IT Jobs: ఐటీ న‌జ‌ర్‌... ఐటీ ఉద్యోగుల‌కు స‌వాళ్ల‌తో సావాసం త‌ప్ప‌దా..?

ఇన్ఫోసిస్‌లో మాత్రమే కాకుండా విప్రోలో 8812 మంది, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో 2506 మంది ఉద్యోగులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. అయితే టీసీఎస్ సంస్థలో 523 మంది కొత్త ఉద్యోగులు చేరినట్లు సమాచారం. అంతే కాకుండా ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల జీతాల పెంపులో కూడా కొంత వాయిదా వేసింది. ఈ బాటలోనే మరి కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇది కూడా ఉద్యోగులు తగ్గడానికి కారణం అని తెలుస్తోంది.

Job Hirings Declined: ఐటీలో ఆందోళనకరం... వైట్‌ కాలర్‌ జాబ్స్ తగ్గుముఖం!

#Tags