Top 5 highest salaries Paying countries : ప్రపంచంలో ఎక్కువ జీతం ఇచ్చే టాప్ 5 దేశాలు ఏంటో తెలుసా!

భార‌త‌దేశంలో పై చ‌దువులు చ‌దువుకున్న చాలా మంది యువ‌త ఉద్యోగాల కోసం ప‌క్క‌దేశాల వైపు చూస్తున్నారు. ఎందుకంటే మ‌న దేశంలో కంటే వారికి బ‌య‌ట దేశాల‌లో 10 రెట్లు జీతం ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌. డ‌బ్బు ఎక్కువగా సంపాదించాల‌నుకొనే వారు ఈ దేశాల‌లో ఉద్యోగం వ‌స్తే అస్స‌లు వ‌దులుకోకండి. ఎక్కువ జీతం ఇచ్చే టాప్ 5 దేశాల ఏంటో అక్క‌డ‌ ఎంత జీతం చెల్లిస్తారో ఒక‌సారి చూద్దాం.
Top 5 highest salaries Paying countries

1. స్విట్జర్లాండ్‌:

స్విట్జర్లాండ్ దక్షిణ-మధ్య ఐరోపాలో గ‌ల పర్వత దేశం. స్విట్జర్లాండ్‌కు ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, లీచ్టెన్‌స్టెయిన్ సరిహద్దులుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్ వైశాల్యం 41,285 చ.కి.మీ. స్విట్జర్లాండ్ జనాభా కేవలం 8.7 మిలియన్స్‌. స్విట్జర్లాండ్ రాజధాని నగరం బెర్న్. స్విట్జర్లాండ్లో అతిపెద్ద నగరం జ్యూరిచ్. స్విట్జర్లాండ్‌లో మాట్లాడే భాషలు జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్.  వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో స్విట్జర్లాండ్ ఎనిమిద‌వ‌ స్థానంలో ఉంది.స్విట్జర్లాండ్‌ కరెన్సీ స్విస్ ఫ్రాంక్(CHF). ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకొనే దేశాల్లో స్విట్జర్లాండ్‌ మొద‌టి స్థానంలో ఉంది. 

స్విట్జర్లాండ్‌లో ఉద్యోగుల సగటు నెల జీతం CHF 6,665 (రూ.6,29,082) (USD 7618). స్విస్ ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారం, స్విట్జర్లాండ్‌లో సగటున‌ జీతం సంవత్సరానికి CHF 79,980 (రూ. 75,48,993) అంటే నెలకు CHF 6,665 (రూ.6,29,082). స్విట్జర్లాండ్‌లో పురుషులు సుమారుగా CHF 6,963 (రూ.6,57,209)  , మహిళలు సుమారుగా CHF 6,211 (రూ.586231) సంపాదిస్తున్నారు
స్విట్జర్లాండ్‌లోని ఫుల్‌టైం ఉద్యోగులు దాదాపుగా CHF 83,700 (రూ.79,00109) వార్షిక జీతంతో జాతీయ స్థూల సగటు కంటే ఎక్కువగా సంపాదిస్తారు. ఫుల్‌టైం చేసే పురుష ఉద్యోగులు సంవత్సరానికి CHF 87,500 (రూ.82,58,775) సంపాదిస్తే, ఫుల్‌టైం చేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి CHF 75,000 (రూ.70,78,950) సంపాదిస్తున్నారని అంచనా.

☛☛ Student Friendly cities: స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీగా లండన్‌

2. లక్సెంబర్గ్‌:

లక్సెంబర్గ్‌ పశ్చిమ ఐరోపాలో గ‌ల‌ దేశం. లక్సెంబర్గ్‌కు బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ సరిహద్దులుగా ఉన్నాయి. లక్సెంబర్గ్ రాజధాని లక్సెంబర్గ్ సిటి. లక్సెంబర్గ్ వైశాల్యం 2,586 చ.కి.మీ. లక్సెంబర్గ్ జనాభా కేవలం 6.4 ల‌క్ష‌లు. లక్సెంబర్గ్‌లో మాట్లాడే భాషలు లక్సెంబర్గిష్, ఫ్రెంచ్, జర్మన్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో లక్సెంబర్గ్ తొమ్మిద‌వ‌ స్థానంలో ఉంది.ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకొనే దేశాల్లో లక్సెంబర్గ్ రెండ‌వ‌ స్థానంలో ఉంది. లక్సెంబర్గ్‌ కరెన్సీ యూరో.

లక్సెంబర్గ్‌లో  పనిచేస్తున్న ఉద్యోగుల సగటు నెల జీతం 6100 యూర్సో (USD 6695)(రూ.5,54,607), సగటు వార్షిక జీతం  73,200 యూర్సో (USD 80,248)(రూ.67,00,000)

☛☛ Henley Passport Index 2023: పాస్‌పోర్టు ర్యాంకింగ్‌లో భారత్‌ స్ధానం ఎంతంటే ?

3. సింగపూర్‌:

సింగపూర్ సముద్ర ఆగ్నేయాసియాలోని ఒక ద్వీప దేశం . సింగపూర్ మలేషియా, ఇండోనేషియాతో సముద్ర సరిహద్దులను పంచుకుంటుంది. సింగపూర్ విస్తీర్ణం 718 చ.కి.మీ. సింగపూర్‌లో దాదాపు 5.7 మిలియన్ల జనాభా ఉంది. సింగపూర్‌లో మాట్లాడే భాషలు ఇంగ్లీష్, మలేయ్, చైనీస్ మాండరిన్, తమిళం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో సింగపూర్ ఇర‌వైఐద‌వ‌(25) స్థానంలో ఉంది. సింగపూర్ కరెన్సీ సింగపూర్ డాలర్(SGD). ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకొనే దేశాల్లో సింగపూర్ మూడ‌వ‌ స్థానంలో ఉంది. 

 సింగపూర్‌లో పనిచేస్తున్న ఉద్యోగి సగటు నెల జీతం 8,450 SGD (USD 6,324)(రూ.5,21,413), సగటున‌ వార్షిక జీతం  1,01,400 SGD (USD 75888)(రూ.62,00,000)

☛☛ World's largest cargo plane-Beluga Airbus: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం-బెలుగా ఎయిర్‌బస్‌

4. యు.ఎస్.ఎ:


యునైటెడ్ స్టేట్స్ తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం సరిహద్దులుగా ఉంది.యునైటెడ్ స్టేట్స్ విస్తీర్ణం 9,833,516 చ.కి.మీ. యునైటెడ్ స్టేట్స్ జనాభా 330 మిలియన్లు. యునైటెడ్ స్టేట్స్ రాజధాని వాషింగ్టన్ D.C. యునైటెడ్ స్టేట్స‌లో మాట్లాడే భాషలు ఇంగ్లీష్ 80%, స్పానిష్ 13%. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో యునైటెడ్ స్టేట్స్ ప‌ద‌హైద‌వ‌(15) స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ కరెన్సీ  డాలర్(USD). ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకొనే దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ నాల్గ‌వ‌ స్థానంలో ఉంది. 

యు.ఎస్.ఎలో  పనిచేస్తున్న ఉద్యోగుల సగటు నెల జీతం USD 6,228 (రూ.5,13,679), సగటు వార్షిక జీతం USD 74,738 (రూ.61,64,315)

☛☛ Social Media Active Users: సోషల్‌ మీడియా యాక్టివ్‌ యూజర్లు 500 కోట్లు

5. ఐస్‌లాండ్:

ఐస్లాండ్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం. ఐస్లాండ్ ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల‌ సరిహద్దులో ఉంది. ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్. ఐస్లాండ్ విస్తీర్ణం 102,775 చ.కి.మీ. ఐస్లాండ్ జనాభా 3.75 లక్షలు. ఐస్లాండ్‌లో మాట్లాడే భాషలు ఐస్లాండిక్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో ఐస్లాండ్ మూడ‌వ‌ స్థానంలో ఉంది. ఐస్‌లాండ్ కరెన్సీ క్రోనా(ISK). ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకొనే దేశాల్లో ఐస్లాండ్ ఐద‌వ‌ స్థానంలో ఉంది. 

ఐస్‌లాండ్లో  పనిచేస్తున్న ఉద్యోగుల సగటు నెల జీతం 690,000 ISK ( USD 5212) (రూ.4,31,428), సగటు వార్షిక జీతం 8280000 ISK ( USD 62,544) (రూ.51,77,136)

☛☛ Most Expensive City: దేశంలో నివాస వ్యయాల పరంగా ఖరీదైన పట్టణం ఇదే.. హైదరాబాద్ స్థానం ఏంతంటే..?

#Tags