Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ... తర్వాత జాబ్ కూడా... ఎక్కడంటే?

సింహాద్రి ఎన్‌టీపీసీ సౌజన్యంతో నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వరంగ సంస్థ సీఐపీఈటీ (విజయవాడ) ఉపాధి కల్పనతో కూడిన శిక్షణ.

సింహాద్రి ఎన్‌టీపీసీ సౌజన్యంతో నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వరంగ సంస్థ సీఐపీఈటీ (విజయవాడ) ఉపాధి కల్పనతో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు సీఐపీఈటీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌.శేఖర్‌ సోమవారం తెలిపారు.

చదవండి: HCL: ఐటీఐ అర్హ‌త‌తో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు... ప‌రీక్ష లేకుండానే నియామ‌కం.. ఇలా అప్లై చేసుకోండి

ఇప్పటికే 30 మంది విజయవాడలో శిక్షణ పొందుతున్నారని, మరో 30 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఎన్‌టీపీసీ సింహాద్రి ప్రాజెక్ట్స్‌ ప్రభావిత గ్రామాల నివాసులైన నిరుద్యోగ యువతకు విజయవాడలో 6 నెలలపాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. అనంతరం సర్టిఫికెట్‌తోపాటు విశాఖపట్నం, అనంతపురం, హైదరాబాద్‌, బెంగళూరు, హోసూర్‌, చైన్నెలో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

చదవండి: SSC Notification 2023: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1558 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి... జాబ్‌ కొట్టండి

#Tags