Job News for Unemployees : నిరుద్యోగుల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. ఎంపికైతే నెల‌కు రూ. 97,750 వ‌ర‌కు వేత‌నం.. ముఖ్య‌మైన వివ‌రాలివే..

చ‌దువు పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నవారికి, మంచి ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.. ఏపీ డీఎంఈ పరిధిలో ప్రభుత్వం వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల ఖాళీగా ఉండ‌గా, వాటిని భర్తీకి చేసేందుకు నోటిఫికేషన్ విడుద‌ల చేసింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలో అందుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్లడించారు.

ఇందులో సీనియర్ రెసిడెండ్(క్లినికల్), సీనియర్ రెసిడెంట్(నాన్ క్లినికల్), సీనియర్ రెసిడెంట్(సూపర్ స్పెషాలిటీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, ఇంటర్వ్యూ వివరాలివే!

మొత్తం ఖాళీల సంఖ్య: 1289

సీనియర్ రెసిడెండ్(క్లినికల్) – 603

సీనియర్ రెసిడెంట్(నాన్ క్లినికల్) – 590

సీనియర్ రెసిడెంట్(సూపర్ స్పెషాలిటీ) – 96

స్పెషాలిటీలు: జనరల్ మెడిసన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరి మెడిసిన్, సైకయాట్రి, రేడియో డయాగ్నోసిస్/రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రెడియో థెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Job Mela: జాబ్‌మేళాకు విశేష స్పందన.. 250కి పైగానే ఎంపిక

ముఖ్య‌మైన విష‌యాలు..

విద్యార్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎండీఎస్) పాసై ఉండాలి.

జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.80,500 నుంచి రూ.97,750 వరకు ఉంది.

వయస్సు: 44 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం: పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవిగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

RailTel Recruitment: రైల్‌టెల్, న్యూఢిల్లీలో టెక్నికల్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ద‌ర‌ఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లోంచి దరఖాస్తులు చేసుకోవాలి.

పదవీకాలం: ఎంపికైన అభ్యర్థులు సంవత్సరం పని చేయాల్సి ఉటుంది.

దరఖాస్తు రుసుము: రూ.2000.. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000 ఉంటుంది.

దరఖాస్తుకు చివరితేది: జ‌న‌వ‌రి 8వ తేదీ


అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఇందులో అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలున్నాయి. వెంటనే అప్తై చేసుకోండి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags