Indian Geography Bit Bank: ‘భూపెన్ హజారిక’ వంతెనను ఏ నదిపై నిర్మించారు?
మాదిరి ప్రశ్నలు
1. బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏయే రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది?
1) సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్
2) అసోం, సిక్కిం
3) అరుణాచల్‌ప్రదేశ్, అసోం
4) అరుణాచల్ ప్రదేశ్, అసోం, సిక్కిం
- View Answer
- సమాధానం: 3
2. కింది వాటిలో ఏ నదికి ‘జాతీయ జల మార్గం – 2’ను ప్రకటించారు?
1) గంగా
2) మాండవి
3) గోదావరి
4) బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: 4
3. బ్రహ్మపుత్ర నది అసోంలోని ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది?
1) దుబ్రి
2) సాదియా
3) జిధోల్
4) డాఖిన్ షాబాజ్‌పూర్
- View Answer
- సమాధానం: 2
4. దేశంలో పొడవైన ‘భూపెన్ హజారిక’ వంతెనను ఏ నదిపై నిర్మించారు?
1) బారక్
2) మానస
3) లోహిత్
4) తీస్థా
- View Answer
- సమాధానం: 3
చదవండి: Geography: Major Port Towns... తూర్పు తీరంలోని ఏకైక సహజ రేవు పట్టణం?
5. జతపరచండి.
నది - జన్మస్థానం
i) రావి - a) వెరినాగ్
ii) సట్లెజ్ - b) బారాలాప్చాలా
iii) జీలం - c) రోహతంగ్
iv) చీనాబ్ - d) రాకాసి సరస్సు
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 2
6. సింధూ నదికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) లడఖ్, జస్కార్ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది
2) ఇది జమ్మూ–కశ్మీర్‌లోని ‘దామ్చోక్’ వద్ద ప్రవేశిస్తుంది
3) ఇది భారత్, పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాల గుండా ప్రవహిస్తుంది
4) ఇది భారత్‌లో కేవలం జమ్మూ–కశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది
- View Answer
- సమాధానం: 3
7. కింది వాటిలో భారతదేశంలో జన్మించని నది ఏది?
1) జీలం
2) చీనాబ్
3) సట్లెజ్
4) బియాస్
- View Answer
- సమాధానం: 3
8. సట్లెజ్ నది భారత్‌లో ఏ కనుమ గుండా ప్రవేశిస్తుంది?
1) షిప్కిలా
2) నాథులా
3) రోహతంగ్
4) జోజిలా
- View Answer
- సమాధానం: 1
9. కింది వాటిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిది?
1) మానస్
2) ష్యోక్
3) సంకోష్
4) డిక్కూ
- View Answer
- సమాధానం: 2
చదవండి: Geography Notes for Group 1, 2: రాణిగంజ్.. దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షేత్రం
10. కింది వాటిలో సరికానిది ఏది?
1) అలకనంద, భగీరథి నదులు ‘దేవప్రయాగ్’ వద్ద కలుస్తాయి
2) అలకనంద, పిండార్ నదులు ‘కరణ్ ప్రయాగ్’ వద్ద కలుస్తాయి
3) గంగా, యమునా నదులు ‘ప్రయాగ్‌రాజ్’ వద్ద కలుస్తాయి
4) అలకనంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది
- View Answer
- సమాధానం: 4
11. కింది వాటిలో యమునా నదిలో కలవని నది ఏది?
1) బెట్వా
2) సోన్
3) కెన్
4) చంబల్
- View Answer
- సమాధానం: 2
12. ‘బిహర్ దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?
1) గండక్
2) దామోదర్
3) కోసి
4) బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: 3
13. కింది వాటిలో ఏ నదికి ‘తెలివాహ నది’ అని పేరు ఉంది?
1) తుంగభద్ర
2) కృష్ణా
3) పెన్నా
4) గోదావరి
- View Answer
- సమాధానం: 4
14. తూర్పు తీరంలో మహానదికి దక్షిణంగా ఉన్న ప్రధాన నది ఏది?
1) కృష్ణా
2) దామోదర్
3) గోదావరి
4) పెన్నా
- View Answer
- సమాధానం: 3
చదవండి: Geography Notes for Group 1, 2 Exams: అరణ్యాలు... దేశంలో అత్యధిక వర్షపాతాన్ని పొందే తీరం ఏది?
15. కింది వాటిలో సరికానిది ఏది?
1) పొన్నని నది – కేరళ
2) మాండవి నది – మహారాష్ట్ర
3) జువారి నది – గోవా
4) వైగై నది – తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
16. నర్మదా నది ఏయే రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది?
1) మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్
2) మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్
3) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్
4) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్
- View Answer
- సమాధానం: 3
17. మహినది పరివాహక ప్రాంతం ఏయే రాష్ట్రాల్లో విస్తరించి ఉంది?
1) మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్
2) మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్
3) రాజస్థాన్, మçహారాష్ట్ర, గుజరాత్
4) మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
18. జతపరచండి.
నది - ఉపనది
i) నర్మదా - a) అమరావతి
ii) తపతి - b) చెయ్యేరు
iii) పెన్నా - c) బేతుల్
iv) కావేరి - d) తావా
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-b, ii-a, iii-d, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 4
గతంలో అడిగిన ప్రశ్నలు
1. జతపరచండి. (టీఎస్. ఎస్సై – 2016 )
నది - ఉపనది
a) గంగ - i) భీమ
b) బ్రహ్మపుత్ర - ii) వైన్ గంగా
c) గోదావరి - iii) తీస్థా
d) కృష్ణా - iv) కోసి
1) a-iv, b-iii, c-ii, d-i
2) a-i, b-ii, c-iii, d-iv
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 1
2. జతపరచండి. (టీఎస్. ఎస్సై – 2016)
జలపాతం - నది
a) దూద్ సాగర్ - i) మాండవి
b) కపిల్దార్ - ii) నర్మదా
c) హోగ్నాకల్ - iii) కావేరి
d) జోగ్ - iv) శరావతి
1) a-iv, b-iii, c-ii, d-i
2) a-i, b-ii, c-iii, d-iv
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 2
3. జతపరచండి.
నది - జన్మస్థానం
a) కావేరి - i) బ్రహ్మగిరి కొండలు
b) నర్మదా - ii) అమర్కంటక్ పీఠభూమి
c) సబర్మతి - iii) ఆరావళి కొండలు
d) కృష్ణా - iv) పశ్చిమ కనుమలు
1) a-iv, b-iii, c-ii, d-i
2) a-i, b-ii, c-iii, d-iv
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో సరైనవి ఏవి? (టీఎస్. ఎస్సై – 2016 )
ఎ) బ్రహ్మపుత్ర నది ఒక పూర్వవర్తి నది
బి) దీనిని టిబెట్‌లో సాంగ్పో అని పిలుస్తారు
సి) ష్యోక్, షిగార్లు దీనికి ముఖ్య ఉపనదులు
1) ఎ, సి
2) బి, సి
3) ఎ, బి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
చదవండి: టీఎస్పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్లైన్ క్లాస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
5. కింది వాటిలో ఏది గోదావరికి ఉపనది కాదు? (ఏపీపీఎస్సీ, గ్రూప్–2 – 2017)
1) ప్రవర
2) కోయనా
3) పూర్ణా
4) మానేరు
- View Answer
- సమాధానం: 2
6. ప్రవర దేనికి ఉపనది? (టీఎస్. గ్రూప్ – 2, 2016)
1) గోదావరి
2) కృష్ణా
3) కావేరి
4) తపతి
- View Answer
- సమాధానం: 1
7. ఆసియా ఖండంలో బ్రహ్మపుత్ర నది వివిధ దేశాల్లో ప్రవహిస్తుంది ఆ దేశాలు/ ప్రాంతాలు ఏవి? (టీఎస్. గ్రూప్ – 2, 2016)
1) నేపాల్, భూటాన్, భారత్, చైనా
2) టిబెట్, చైనా, భూటాన్, భారత్
3) చైనా, భారత్, భూటాన్, బంగ్లాదేశ్
4) టిబెట్, చైనా, భారత్, బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
8. తూర్పు తీరంలో ఉన్న నదుల వరుసక్రమం (దక్షిణం నుంచి ఉత్తరానికి) (ఏపీ ఎస్సై – 2017)
1) కావేరి,పెన్నా, కృష్ణా, గోదావరి, మహానది
2) గోదావరి,కృష్ణా, కావేరి, మహానది, పెన్నా
3) కావేరి, పెన్నా, వైగై, మహానది, కృష్ణ
4) కృష్ణా, గోదావరి, మహానది, కావేరి, వైగై
- View Answer
- సమాధానం: 1
9. పరివాహక ప్రాంత విస్తీర్ణం ప్రకారం గోదావరి ఉప నదుల్లో పెద్దది ఏది? (ఏపీ గ్రూప్ – 1, 2017)
1) శబరి
2) ప్రాణహిత
3) ఇంద్రావతి
4) మంజీరా
- View Answer
- సమాధానం: 2
చదవండి: Geography Important Bit Bank: భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం ఏది?
10. కింది వాటిలో నది – ఉపనది జతల్లో సరైంది ఏది? (ఏపీ ఎస్సై – 2016)
1) గంగా–దామోదర్
2) సింధూ–యమున
3) గోదావరి – తుంగభద్ర
4) మహానది – శబరి
- View Answer
- సమాధానం: 1
11. సట్లెజ్ నది ఉద్గమ స్థానం ఏది? (ఏపీ గ్రూప్ – 3, 2017)
1) పిండారీ
2) రాక్షస్తల్
3) గంగోత్రి
4) భీమాతల్
- View Answer
- సమాధానం: 2
12. పెన్నా నది ఏ ప్రాంతం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది? (ఏపీ. ఏ. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ – 2017)
1) నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు
2) నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం
3) ప్రకాశం జిల్లా కొత్తపట్నం
4) పులికాట్ సరస్సు గుండా
- View Answer
- సమాధానం: 1
13. కింది నదుల్లో ఏది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది?
1) దామోదర్
2) కోసి
3) నర్మదా
4) గోదావరి
- View Answer
- సమాధానం: 3
14. పెన్నా నది మూలస్థానం ఎక్కడ ఉంది?
1) నంది కొండలు
2) చాముండి కొండలు
3) దొడబెట్ట
4) రామగిరి కొండలు
- View Answer
- సమాధానం: 1
చదవండి: Indian Geography: భారతదేశం - భౌతిక స్వరూపాలు.. హిమాద్రి పర్వత శ్రేణుల సరాసరి ఎత్తు ఎంత?
15. చనఖా–కోరటా గ్రామాలు ఏ నదీ తీరంలో ఉన్నాయి?
1) పెన్‌గంగా
2) గోదావరి
3) ప్రాణహిత
4) మానేరు
- View Answer
- సమాధానం: 1
నదులు | జన్మస్థానం | ప్రవహించే మార్గం/ రాష్ట్రాలు | ఉపనదులు |
1. సింధూ | మానస సరోవరం వద్ద బొకార్చు (టిబెట్ ప్రాంతం) |
టిబెట్, భారత్,పాకిస్థాన్. భారత్‌లో జమ్మూ–కశ్మీర్ |
ష్యోకో, గిల్గిత్, త్యాజ్, కాబుల్, గర్తాంగ్, షిగార్, జష్కర్, హుంజ్, ద్రాస్, జీలం, చీనాబ్, రావి,బియాస్, సట్లెజ్ |
2. బ్రహ్మపుత్ర | మానస సరోవరం వద్ద ఉన్న చెమయంగ్డమ్ (టిబెట్ ప్రాంతం) |
టిబెట్ (చైనా), భారత్, బంగ్లాదేశ్. భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం |
రైడాక్, తీస్థా, అమోచు, బరేలీ, పగ్లాదియా, బేల్‌సిరి, దిబ్రూ, డిక్కూ, ధన్సిరి, సబసిరి, సంకోష్, మానస, దిబాంగ్, లోహిత్, సుర్మా, బారక్ |
3. గంగా | గంగోత్రి వద్ద జన్మించే భగీరథి, అల్క వద్ద జన్మించే అలకనంద కలయిక వల్ల ఏర్పడుతుంది | ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ (సరిహద్దు గుండా), పశ్చిమ బెంగాల్ | రామ్‌గంగా, గోమతి, గండక్, కోసి, కాళి, ఘాఘ్రా, యమున, చంబల్, బెట్వా, కెన్, సోన్, దామోదర్, సింధ్, థాన్స్ |
4. యమున | ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి | ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ | చంబల్, బెట్వా, కెన్, సింధ్ |
5. దామోదర్ | చోటానాగ్పూర్ పీఠభూమిలోని ‘టోరి’ వద్ద | జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ | బరాకర్, కోణర్, ఘరీ, జమునై |
6. గోదావరి | పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ వద్ద | మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ | ప్రవర, మూల, మానేరు, మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని |
7. కృష్ణా | పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద | మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ | తుంగభద్ర, భీమా, మలప్రభ, ఘటప్రభ, పంచగంగ దూద్‌గంగా, మూసీ, దిండి, వర్ణ, కోయనా, పాలేరు, మున్నేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు |
8. కావేరి | పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు | కర్ణాటక, తమిళనాడు | హేమవతి, భవాని, అమరావతి, ఆర్కావతి లోకపావని, కబినీ, హేరంగీ, లక్ష్మణతీర్థ, సువర్ణవతి |
9. పెన్నా | కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని నందిదుర్గ కొండల్లో చెన్నకేశవ శిఖరం | కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ | చిత్రావతి, జయమంగళి, సగిలేరు, చెయ్యేరు, కుందేరు, పాపాఘ్ని |
10. మహానది | ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పీఠభూమి (దండకారణ్యం)లోని శిహావా ప్రాంతం | ఛత్తీస్‌గఢ్, ఒడిశా | మండ్, లేవ్, ఇబ్, టెల్, జోంక్, ఓంగ్, సియోనాథ్ |
11. నర్మదా | మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ వద్ద | మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ | హిరన్, ఓర్సంగ్, తావా, దూది, బార్నెర్, శక్కార్, కుంద, బంజర్, షార్, వరిపాన్ |
12. తపతి | మధ్యప్రదేశ్‌లోని ముల్తాయ్ వద్ద | మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ | పూర్ణ, బేతుల్, పాట్కి, గిర్నా, గంజాల్, పలేర్, కాప్రాబోరీ |
13. సబర్మతి | ఆరావళి పర్వతాల్లోని మేవాడ్ ప్రాంతం | రాజస్థాన్, గుజరాత్ | వాకల్, సేది, హత్మతి, హరా |
14. మహినది | వింధ్యా పర్వతాల్లోని సర్ధార్పూర్కు దక్షిణంగా (మధ్యప్రదేశ్) | మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ | సోమ్, పనమ్, అనాబ్ |
15. సోన్ | మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ పీఠభూమిలో | మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్ | మహానందా, రిహాండ్, గోవత్ |
16. చంబల్ | మధ్యప్రదేశ్‌లోని జనపావో కొండల్లోని ‘మౌ’ అనే ప్రాంతం | మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ | బనాస్, పర్బతి, కాళీసింధ్ |