TSPSC News Group 1,2,3,4 Notification Details 2024 : తెలంగాణలో ప్రస్తుతం గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్ల పరిస్థితి ఇలా..! కొత్త తేదీలు ఇవే..!
అవి ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో వీటి పరిస్థితి ఎలా ఉందంటే..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరిస్థితి ఇలా.. :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే తాజాగా హైకోర్టు రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేయడంతో మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. అయితే నూతన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హమీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి నూతన నోటిఫికేషన్ విడుదల చేస్తుందా లేదా మరో నోటిఫికేషన్ విడుదల చేస్తుందా. అనేది చూడాల్సి ఉంది. అలాగే కొత్తగా మొత్తం ఎన్ని గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనే విషయం క్లారిటీ లేదు.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరిస్థితి ఇలా.. :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు వివిధ కారణాలతో వాయిదా పడింది. 780 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జనవరి 6,7 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఇది కూడా వాయిదా పడింది. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఏప్రిల్ 1వ తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. పాత నోటిఫికేషన్‌లోని 780 పోస్టులకు, అలాగే కొత్త నోటిఫికేషన్‌లో మరిన్ని పోస్టులు కలిపి.. నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు పాత నోటిఫికేషన్‌లోని 780 గ్రూప్-2 పోస్టులకు పరీక్ష ఇక జరగనట్టే. కొత్తగా మొత్తం ఎన్ని గ్రూప్–2 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనే విషయం క్లారిటీ లేదు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 పరిస్థితి ఇలా.. :
తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,380 గ్రూప్–3 పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే ఇప్పటివరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేయలేదు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 2024 జూన్ 01వ తేదీన TSPSC ద్వారా గ్రూప్–3 ఉద్యోగాలకు కొత్తగా మరో నోటిఫికేషన్ ఇవ్వనున్నరు. ఇక పాత నోటిఫికేషన్ లేనట్టే. కొత్తగా మొత్తం ఎన్ని గ్రూప్–3 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనే విషయం క్లారిటీ లేదు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ పరిస్థితి మరి..:
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8,039 గ్రూప్–4 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించింది. ప్రాథమిక, తుది కీలను కూడా విడుదల చేసింది. ఫలితాల విడుదల ఎన్నికల కారణంగా వాయిదా పడింది. నూతన ప్రభుత్వం వీలైనంత త్వరగా తుది ఫలితాలను విడుదల చేసి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 2024 జూన్ 01వ తేదీన TSPSC ద్వారా గ్రూప్–4 ఉద్యోగాలకు కొత్తగా మరో నోటిఫికేషన్ ఇవ్వనున్నరు. మొత్తం ఎన్ని గ్రూప్–4 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనే విషయం క్లారిటీ లేదు.
☛ TS Government Jobs 2024 : ఈ శాఖలోని 6000 పోస్టుల భర్తీకి చర్యలు.. ఉద్యోగాల వివరాలు ఇవే..