TSPSC Group-4 Jobs Update News 2024 : గ్రూప్‌-4 పోస్టుల మెరిట్ లిస్ట్.. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-4 పోస్టుల గురించి కీల‌క అప్‌టేడ్ ఇచ్చింది.

త్వరలోనే గ్రూప్–4 నోటిఫికేషన్‌కు సంబంధించిన 1:3 మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇప్పటికే జనరల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ త్వరలోనే జనరల్ మెరిట్ లిస్ట్ (1:3), PWD అభ్యర్దుల మెరిట్ లిస్ట్ (1:5) లను విడుదల చేయనున్నారు. అలాగే ఈ సందర్భంగా గ్రూప్–4 ప‌రీక్ష‌ రాసిన అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాల్సిన సర్టిఫికెట్‌ల‌ను సూచించింది. EWS, కులం, నాన్ క్రిమిలేయర్, స్టడీ సర్టిఫికెట్‌లు ఇతర సర్టిఫికెట్‌ల‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

☛ History Quiz for Competitive Exams: UPSC సివిల్స్, APPSC మరియు TSPSC వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే కొన్ని టాప్ 60 హిస్టరీ క్విజ్ ప్రశ్నలు క్రింద ఉన్నాయి.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ గ్రూప్‌-4 ప‌రీక్ష‌ను 2023 జూలై 1వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు.

గ్రూప్‌-4 సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.

2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ  

3) పరీక్ష హాల్‌టికెట్

4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో. 

5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి. 

6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో. 

7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).

8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.

9) రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC  ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

10) పీహెచ్ సర్టిఫికేట్ 

11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి. 

12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి. 

13) నోటిఫికేషన్‌ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి. 

#Tags