Success Story : నేను ఒక పేదింటి బిడ్డను.. ఒకేసారి రెండు గవర్నమెంట్ ఉద్యోగాలను కొట్టానిలా...కానీ..!
పుట్టి.. పేరిగింది అంతా పేద కుటుంబంలోనే.. కానీ ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించింది మౌనిక. ఇటీవలే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అలాగే టీఎస్‌పీఎస్సీ గ్రూప్–4 పరీక్ష ఫలితాల్లో కూడా కొలువుకు ఎంపికైంది మౌనిక. ఈ నేపథ్యంలో మౌనిక సక్సెస్ జర్నీ మీకోసం...
కుటుంబ నేపథ్యం :
మౌనిక తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం నాదులా పూర్ గ్రామానికి చెందిన వారు. ఈమె తల్లిదండ్రులు మిరపకాయల శివ్వప్ప, హేమలత.
ఎడ్యుకేషన్ :
మౌనిక.. చిన్నప్పట్నుంచీ చదువులో ముందుండేది. పేదరికం కారణంగా మౌనిక విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేసింది. ఉన్న కొద్దిపాటి భూమిలోనే తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ మౌనికను చదివించారు. ఉస్మానియా వర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేసిన మౌనిక పోటీ పరీక్షలు రాస్తూ రెండు ఉద్యోగాలు సాధించింది.
మౌనిక సాధించిన విజయాల పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మౌనిక త్వరలోనే విద్యాశాఖలో కొలువులో చేరనున్నట్లు మౌనిక కుటుంబసభ్యులు తెలిపారు.
#Tags