TSPSC Group 4 Questions : గ్రూప్‌–4 రాత‌ప‌రీక్ష‌లో.. 'భారత రాజ్యాంగం' విభాగం నుంచి అడిగే ప్ర‌శ్న‌లు ఇవే.. ఈ ముఖ్య‌మైన అంశాల‌ను చ‌దివితే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : 8,180 గ్రూప్‌–4 ఉద్యోగాలు.. 9,51,321 దరఖాస్తులు.. పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. అయితే గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు ప్రిపేరయ్యే అభ్య‌ర్థులు పోటీని ప‌ట్టించుకోకుండా.. మీరు చ‌ద‌వాల్సిన ముఖ్య‌మైన అంశాల‌ను ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌దివే.. మీరు ఉద్యోగాన్ని ఈజీగా కొట్ట‌వ‌చ్చును.
Indian Constitution Bits

ఈ నేప‌థ్యంలో.. గ్రూప్‌-4 పేప‌ర్‌-1 మొత్తం 150 ప్ర‌శ్న‌లకు ప‌రీక్ష ఉంటే.. ఇందులో ముఖ్య‌మైన భారత రాజ్యాంగం విభాగం నుంచి.. 10–15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎక్కువ మార్కులు సాధించే అవకాశమున్న ముఖ్య‌మైన విభాగం ఇది. కరెంట్‌ ఆఫైర్స్‌ను అనుసంధానించుకుంటూ, చాప్టర్ల వారీగా చదవాలి. అలాగే గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి. కొన్ని సందర్భాల్లో అవి రిపీట్‌ అయ్యే అవకాశం కూడా ఉంది. వీటితోపాటు మాక్‌ టెస్ట్‌లు రాయాలి.

➤ Indian Polity Partition of India Notes: దేశ విభజనకు దారి తీసిన చట్టం ఏది?

భార‌త రాజ్యాంగంలోని ఈ అంశాలపై ప‌ట్టు.. సాధిస్తే..

☛ భారత రాజ్యాంగం - పరిణామ క్రమం, స్వభావం, ఉన్నత లక్షణాలు, ప్రవేశిక
☛ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు
భారత సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలనాపరమైన అధికారాల విభజన.
☛ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి - అధికారాలు, విధులు.
☛ 73వ, 74వ రాజ్యాంగ సవరణలు - గ్రామీణ, పట్టణ పరిపాలన
☛ ఎన్నికల విధానం: స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు.
☛ భారత దేశంలో న్యాయ వ్యవస్థ - న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
☛ ఎ) షెడ్యూల్డ్ కులాలు, తరగతులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలకు ప్రత్యేక రక్షణలు
బి) సంక్షేమం అమలు విధానం - షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్,    

☛ షెడ్యూల్డ్ తరగతుల జాతీయ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్

Also read: Fundamental Rights (Article 28-32): ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త ఎవ‌రు?

భారత రాజ్యాంగం.. నూతన సవాళ్లు.. : 
☛ సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రభుత్వ విధానాలు
భారత దేశ సామాజిక నిర్మాణం: భారతీయ సమాజం ప్రధాన లక్షణాలు: కులం, కుటుంబం, పెళ్లి, బంధుత్వం, మతం, తెగ, మహిళ, మధ్య తరగతి; తెలంగాణ సమాజం సామాజిక, సాంస్కృతిక లక్షణాలు.
☛ సామాజిక సమస్యలు: అసమానత్వం, బహిష్కరణ: కులతత్వం, కమ్యూనలిజం, ప్రాంతీయతత్వం, మహిళలపై హింసాత్మకత, బాలకార్మిక వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా, వైకల్యం, వృద్ధాప్యం.
☛ సామాజిక ఉద్యమాలు: రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళితుల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
☛ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సమస్యలు: వెట్టి, జోగినీ, దేవదాసి వ్యవస్థలు, బాలకార్మిక వ్యవస్థ, బాలికా సమస్యలు (గర్ల్ చైల్డ్), ఫ్లోరోసిస్, వలసలు, రైతులు, నేత కార్మికుల బాధలు.
☛ సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు: ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, వికలాంగులు, పిల్లలకు సంబంధించి ప్రత్యేక విధానాలు; సంక్షేమ కార్యక్రమాలు: ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు; గ్రామీణ, పట్టణ, మహిళా, పిల్లల సంక్షేమం, గిరిజన సంక్షేమం.

Also read: Fundamental Rights of India: ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?

#Tags