TSPSC Group 4 Economy Questions : గ్రూప్‌–4 రాత‌ప‌రీక్ష‌లో.. 'ఎకాన‌మీ' నుంచి అడిగే ప్ర‌శ్న‌లు ఇవే.. ఈ అంశాల‌పై ప‌ట్టు ఉంటే చాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(TSPSC) గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు.. పోటీ మాత్రం ఎక్కువ‌గానే ఉంది. అయితే గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు ప్రిపేరయ్యే అభ్య‌ర్థులు పోటీని ప‌ట్టించుకోకుండా.. మీరు చ‌ద‌వాల్సిన ముఖ్య‌మైన అంశాల‌ను ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌దివే.. మీరు ఉద్యోగాన్ని ఈజీగా కొట్ట‌వ‌చ్చును. ఈ నేప‌థ్యంలో.. గ్రూప్‌-4 పేప‌ర్‌-1 మొత్తం 150 ప్ర‌శ్న‌లకు ప‌రీక్ష ఉంటే.. ఎకాన‌మీ విభాగం నుంచి 10–15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
TSPSC Group 4 Economy

పాఠశాల స్థాయి బేసిక్‌ అంశాలతో ప్రారంభించి, భారత ఆర్థిక సర్వే, బడ్జెట్లపైన స్థూలంగా అవగాహన పెంచుకోవాలి. స్థూల గణంకాలపై అవగాహన ఉండాలి. ప్రణాళిక వ్యవస్థ, నీతి ఆయోగ్, సాంఘిక ఆర్థిక సమస్యలైన నిరుద్యోగం,పేదరికం, మౌలిక భావనలు తెలుసుకోవాలి. వాటిని నిర్మూలనకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, ప్రస్తుతం అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విత్త, ద్రవ్య వ్యవస్థలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

➤ TSPSC Group 4 Questions : గ్రూప్‌–4 రాత‌ప‌రీక్ష‌లో.. 'భారత రాజ్యాంగం' విభాగం నుంచి అడిగే ప్ర‌శ్న‌లు ఇవే.. ఈ ముఖ్య‌మైన అంశాల‌ను చ‌దివితే..

ఈ ముఖ్య‌మైన అంశాల‌పై ప‌ట్టు సాధిస్తే..

➤ ప్రగతి, అభివృద్ధి: భావనలు, పరస్పర సంబంధం.
➤ ఆర్థికాభివృద్ధి గణన: జాతీయాదాయం, నిర్వచనం, జాతీయాదాయ గణనకు సంబంధించిన భావనలు, పద్ధతులు, నామమాత్ర, వాస్తవ ఆదాయం.
➤ పేదరికం, నిరుద్యోగం: పేదరికం భావనలు - ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయ రహిత పేదరికం, పేదరికాన్ని గణించే విధానం, నిరుద్యోగం- నిర్వచనం, నిరుద్యోగం రకాలు.
➤ భారత ఆర్థిక ప్రణాళిక: పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యాలు, వ్యూహాలు, విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక; సమ్మిళిత వృద్ధి, నీతి ఆయోగ్.

☛ TSPSC Group 4 Geography Questions : గ్రూప్‌–4 రాత‌ప‌రీక్ష‌లో.. 'జాగ్రఫీ' నుంచి అడిగే ప్ర‌శ్న‌లు ఇవే..

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి :

➤ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1954-2014)లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దుర్వినియోగం

➤ నీళ్లు (బచావత్ కమిటీ), నిధులు (లలిత్, భార్గవ, వాంచూ కమిటీలు), ఉపాధి కల్పన (జై భారత్ కమిటీ, గిర్‌గ్లాన్ కమిటీ).
➤ తెలంగాణలో భూ సంస్కరణలు: మధ్యవర్తిత్వ విధానాల నిర్మూలన - జమీందారీ, జాగిర్దారీ, ఇనాందారీ, టెనాన్సీ విధానాలు, భూ పరిమితి, షెడ్యూల్డ్ ఏరియాల్లో ల్యాండ్ ఎలియేషన్.
➤ వ్యవసాయం, సంబంధిత రంగాలు: జీఎస్‌డీపీలో వ్యవసాయం, సంబంధిత రంగాల పాత్ర, భూ పంపిణీ, వ్యవసాయంపై ఆధారం, నీటి పారుదల, జల వనరులు, మెట్ట భూముల్లో సాగు ఇబ్బందులు.
➤ పారిశ్రామిక, సేవా రంగాలు: పారిశ్రామిక అభివృద్ధి; పారిశ్రామిక ప్రగతి, నిర్మాణం - చిన్న, సూక్ష్మ తరహా, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ); పారిశ్రామిక అవస్థాపనా సౌకర్యాలు; తెలంగాణ పారిశ్రామిక విధానం, సేవా రంగం నిర్మాణం, ప్రగతి.

అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు, పరిణామాలు : 
☛ అభివృద్ధిలో గతిశీలత: భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు, సాంఘిక అసమానతలు - కులం, తెగ, లింగ, మత ప్రాతిపదిక అసమానతలు; వలసలు, పట్టణీకరణ.
☛ అభివృద్ధి, స్థానచలనం: భూసేకరణ విధానం; పునరుద్ధరణ, పునరావాసం
☛ ఆర్థిక సంస్కరణలు: ప్రగతి, పేదరికం, అసమానతలు-సాంఘిక అభివృద్ధి (విద్య, ఆరోగ్యం), సామాజిక రూపాంతరత, సాంఘిక భద్రత.
☛ సుస్థిర అభివృద్ధి: భావనలు, గణన, లక్ష్యాలు.

☛ TSPSC Group 4 Total Applications : గ్రూప్‌-4 కు 9,51,321 దరఖాస్తులు.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీప‌డుతున్నారంటే...?

#Tags