TGPSC Group 2 Exams : డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు.. సిలబస్‌పై పట్టు సాధించాలంటున్న నిపుణులు!
మొత్తం 783 పోస్ట్‌ల భర్తీకి నాలుగు పేపర్లుగా గ్రూప్–2 పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించనుంది. ఉద్యోగార్థులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పరీక్షలకు మరో 25 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో.. గ్రూప్ 2లో విజయానికి రివిజన్ వ్యూహం, ఎగ్జామ్ డే టిప్స్‌పై ప్రత్యేక కథనం..
నాలుగు పేపర్లలో జరిగే గ్రూప్ 2 పరీక్షలో..జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు రివిజన్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. ఇప్పటి వరకూ చదివిన అంశాలను పదేపదే పునశ్చరణ చేసుకోవాలి. ప్రస్తుత సమయంలో కొత్త పుస్తకాలు, కొత్త టాపిక్స్‌కు దూరంగా ఉండటమే మేలు. ప్రతి రోజూ ప్రతి పేపర్ చదివేలా ప్లాన్ చేసుకోవాలి.
10 Member MPs Committee: రాజ్యసభ నుంచి జేఎన్‌యూ కోర్టుకు కె.లక్ష్మణ్
డిస్క్రిప్టివ్ విధానం
గ్రూప్ 2 పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. అభ్యర్థులు డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాసరూప విధానంలో సబ్జెక్టుపై పట్టు సాధిస్తూ.. ఆబ్జెక్టివ్ బిట్స్‌ను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. అన్ని కోణాల్లో అవగాహన ఉంటేనే సమాధానాలు ఇచ్చేవిధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రస్తుత సమయంలో డిస్క్రిప్టివ్ పద్ధతిలో చదువుతూ.. ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ప్రతి రోజు సగటున 8 నుంచి 10గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.
ఉమ్మడి అంశాలకు
ఆయా టాపిక్స్‌కు సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాల వరకూ.. సమగ్ర అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సదరు పేపర్లలో ఉన్న ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని ఒకే సమయంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీలో పేపర్ల వారీగా కామన్‌గా ఉన్న టాపిక్స్‌ను గుర్తించాలి. వాటిని ఒకే సమయంలో పూర్తి చేసుకోవాలి. దీంతోపాటు సదరు అంశాలను అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
సొంత నోట్స్ ఎంతో మేలు
అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభం నుంచే ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రాసుకుంటారు. ప్రస్తుత సమయంలో దీన్ని రివిజన్ కోసం సద్వినియోగం చేసుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన అంశాలు, పాయింట్లతో రాసుకున్న నోట్స్‌ను చదువుతూ ముందుకు సాగాలి. సొసైటీకి సంబంధించి మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు, ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు, జనాభా సంఖ్య.. ఇలా అన్నింటినీ చదవాలి. అప్పుడే సదరు టాపిక్స్‌పై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
గణాంక సమాచారం
గ్రూప్–2 అభ్యర్థులు గణాంక సహిత సమాచారాన్ని ఔపోసన పట్టాలి. ముఖ్యంగా ఎకానమీ, జాగ్రఫీలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 2011 జనగణన, గణాంకాలపై పట్టు సాధించాలి. చరిత్రకు సంబంధించి ముఖ్యమైన సంవత్సరాలు–సంబంధిత సంఘటనలతో కూడిన జాబితా రూపొందించుకోవాలి. ప్రతి పేపర్‌లో పూర్తిగా ఫ్యాక్టువల్ డేటా ఆధారంగా అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. కాబట్టి డేటాపై పట్టు సాధిస్తే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం ఎంత; ఏ జిల్లాలో ఎక్కువ, ఏ జిల్లాలో తక్కువ; రాష్ట్రంలో, దేశంలో జన సాంద్రత, గ్రామీణ, పట్టణ జనాభా తీరుతెన్నులు, దేశంలో, రాష్ట్రంలో లింగ నిష్పత్తి వంటివి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
తెలంగాణపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ అంశాలకు పరీక్షలో ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా తెలంగాణ పాలసీపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు, అనంతరం ఎలాంటి కొత్త విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి. అదే విధంగా రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన పథకాలపై అవగాహన పెంచుకోవాలి. వెనుకబడిన తరగతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు తదితర వర్గాలకు సంబంధించి తెచ్చిన నూతన పథకాల గురించి తెలుసుకోవాలి.
పేపర్–4 స్కోరింగ్
గ్రూప్–2 అభ్యర్థులు పేపర్–4 పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఈ పేపర్‌ను ‘తెలంగాణ ఆలోచన (1948–1970), ఉద్యమ దశ (1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991–2014)) దశగా పేర్కొన్నారు. ముఖ్యంగా 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకూ జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు, కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.
G20 Summit: జీ20 సదస్సులో మోదీ భేటీ అయిన నేతలు వీరే..
‘స్పెషల్’ ఫోకస్
తెలంగాణ ప్రత్యేక అంశాలను చదివేటప్పుడు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీపై అభ్యర్థులు లోతైన అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ చరిత్రలో శాతవాహనలు, ఇక్ష్వాకులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో పాలన తీరుతెన్నులు, ముఖ్య పరిణామాలు; సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు, కళలు, సాహిత్యం, శిల్పం, తెలంగాణలోని కవులు –రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన అవసరం. ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు–ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై పట్టు సాధించాలి. తాజా బడ్జెట్ గణాంకాలు, ఆయా శాఖలు, పథకాలకు కేటాయింపులపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ప్రాక్టీస్ టెస్ట్‌లు
ప్రస్తుతం సమయంలోప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం కూడా మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌లలో తమకు ఇప్పటి వరకు లభించిన పరిజ్ఞాన స్థాయిపై అవగాహన లభిస్తుంది. ఇంకా చదవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది. అదే విధంగా తాము చేస్తున్న పొరపాట్లను విశ్లేషించుకుని, పరీక్షలో వాటిని సరిదిద్దుకునే వీలుంటుంది.
పరీక్ష రోజు ఇలా
ఓఎంఆర్ షీట్ అత్యంత అప్రమత్తంగా
పరీక్షలో సమాధానాలు గుర్తించేందుకు ఉద్దేశించిన ఓఎంఆర్ షీట్ నింపడలో అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఓఎంఆర్ షీట్‌ను తప్పులు లేకుండా నింపడంతోపాటు సమాధానాలు బబ్లింగ్ చేసే క్రమంలో.. ప్రశ్న సంఖ్య, ఆప్షన్‌ను క్షుణ్నంగా గుర్తించాలి. ఎంతో మంది ఓఎంఆర్ షీట్‌ను పూర్తి చేయడంలో పొరపాట్లు చేసి.. సమాధానాలన్నీ సరిగా రాసి కూడా విజయం చేజార్చు కుంటున్నారు. అదేవిధంగా హాల్‌టికెట్ అందుబాటులోకి రాగానే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
NMPA Recruitments : ఎన్‌ఎంపీఏలో డైరెక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలు
ప్రశ్నలు చదవడానికి సమయం
పరీక్ష రోజున సమాధానాలిచ్చే క్రమంలో.. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనే తొందరపాటును వీడాలి. ముందుగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. కనీసం పది నిమిషాలపాటు ప్రశ్న పత్రం పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్లత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత సులభంగా భావించిన ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వాలి. అనంతరం ఓ మోస్తరు క్లిష్టత ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. చివరగా అత్యంత క్లిష్టమైన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. దీనికి భిన్నంగా ముందు తమకు అవగాహన లేని ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు ఉపక్రమిస్తే.. సమయం వృధా కావడమే కాకుండా.. సమాధానాలు స్ఫురించక.. మానసికంగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. పర్యవసానంగా తమకు తెలిసిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఎలిమినేషన్.. చివరగా
ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్షల్లో చాలా మంది అభ్యర్థులు చేసే పని.. ఎలిమినేషన్ టెక్నిక్‌ను అనుసరించడం. అంటే.. నాలుగు సమాధానాల్లో.. ప్రశ్నకు సరితూగని సమాధానాలను ఒక్కొక్కటిగా తొలగించి.. చివరగా మిగిలిన ఆప్షన్‌ను సమాధానంగా గుర్తిస్తారు. ఈ టెక్నిక్‌ను కూడా పరీక్ష చివరి దశలోనే అమలు చేయాలి. అప్పటికే తమకు సమాధానాలు తెలిసిన అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకున్నామని భావించాకే ఎలిమినేషన్ లేదా గెస్సింగ్‌పై దృష్టి పెట్టాలి.
HAL Jobs : హాల్లో షార్ట్ టర్మ్ ప్రాతిపదికన ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు!