TSPSC Group 2 Exam Postponed Issue : టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వ‌ద్ద‌ తీవ్ర ఉద్రిక్తత.. గ్రూప్‌-2 ప‌రీక్ష‌ను వాయిదా వేయాల్సిందే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) కార్యాలయం దగ్గర ఆగ‌స్టు 10వ తేదీ(గురువారం) ఉద‌యం నుంచి తీవ్ర ఉద్రికత్త చోటచేసుకుంది. గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్‌ టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.
TSPSC Group 2 Exam 2023 Postponed News

ఆఫీస్‌ ముందు వేలాది మంది అభ్యర్థులు బైఠాయించారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు తమకు సమయం లేదని చెబుతూ గ్రూప్‌-2 వాయిదా వేయాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్‌​, టీజేఎస్‌ మద్దతు తెలిపింది. కోదండరాం, దయాకర్‌, కాంగ్రెస్‌ నేతలు నిరనసలో పాల్గొన్నారు. 

☛ APPSC/TSPSC Group-2 Jobs Success Tips 2023 : గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

ఇక మరో మూడు నెలలు ఆగలేదా..?

గ్రూప్‌ 2 పరీక్షలను వాయిదా వేయాలని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కోరారు. అభ్యర్థులతో కలిసి నిరసనల్లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం జేఎల్‌, గ్రూప్‌ 2 పరీక్షలు వరుసగా ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలకు చదువుకునేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. ఏడేళ్లు ఆగిన ప్రభుత్వం.. పరీక్షకు మరో మూడు నెలలు ఆగలేదా?అని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ప్రశ్నించారు. తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని..అభ్యర్థుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

☛ TSPSC Group 2 Exam 2023 Date and Timings : గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల తేదీల‌పై.. సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. పరీక్షకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా..

వ‌రుస ప‌రీక్ష‌లతో స‌త‌మ‌తం..
ఇప్పటికే ఆగ‌స్టు 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్స్‌కు చదివేందుకు సమయం లేదని వాపోయారు. అంతేగాక ఇప్పటికే పలు పేపర్ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరగాల్సి ఉంది. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ.. 

ఒకే నెలలో గ్రూప్-2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్‌లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా గ్రూప్-2 పరీక్షలోని మూడో పేపర్ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్-2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

☛ టీఎస్‌పీఎస్సీ Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags