APPSC Group 1 Ranker Success Story : ఈ ల‌క్ష్యం కోస‌మే చ‌దివా.. అనుకున్న‌ట్టే.. డిప్యూటీ కలెక్టర్ కొట్టానిలా..

అనేక సవాళ్లను అధిగమించి గ్రూప్‌–1 (2018) ఫలితాలను ఏపీపీఎస్సీ విడుద‌ల చేసింది. నాలుగేళ్లుగా సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రూప్‌-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశ‌లు ఫ‌లించాయి. ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను విడుద‌ల చేసింది.
దాట్ల‌ కీర్తి

2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.  ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికైన దాట్ల‌ కీర్తి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

APPSC Group 1 Ranker Success Story : నా ఫోన్‌తోనే.. గ్రూప్‌-1 ర్యాంక్ కొట్టానిలా.. ఎలా అంటే..?

కుటుంబ నేప‌థ్యం :
కీర్తి స్వస్థలం విశాఖజిల్లా మాకివారిపాలెం మండలంలోని రాజులనగరం. ఆమె తల్లి దాట్ల నిర్మల విశాఖపట్నం జిల్లా చోడపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. తండ్రి జగన్నాథ రాజు హెచ్‌సీ వెంకటాపురం మండలం జెడ్పీహెచ్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌(సైన్సు)గా పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు.

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

ఎడ్యుకేష‌న్‌: 
సొంత గ్రామంలోని జడ్పీ పాఠశాలలో పదోతరగతి వరకు చ‌దివారు. తర్వాత ఇంటర్‌, డిగ్రీ(బీఎస్సీ) విజయనగరంలో పూర్తిచేశారు. ఎమ్మెస్సీ (బోటనీ) ఏయూలో చేశారు.

Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

ఉద్యోగంలో ఉండ‌గానే..
ఉద్యోగ ప్రయత్నాల్లో పలువురు సివిల్స్‌కే అధిక‌ ప్రాధాన్యం ఇస్తారు. ఆమె ఆశ కూడా అదే. ఐఏఎస్‌ కావడానికి రెండోమార్గమైన గ్రూప్‌-1ను ఆమె ఎంచుకున్నారు. ఆర్డీఓగా ఎంపికై పదోన్నతిపై ఐఏఎస్‌ కావచ్చని భావించారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అవిశ్రాంతంగా కృషిచేసి చివరకు విజయం సాధించారు. పట్టుదలతో పోరాడితే విజయం సాధించవచ్చని నిరూపించారు దాట్ల కీర్తి. విజయనగరం జిల్లా బీసీ సంక్షేమాధికారి దాట్ల కీర్తి గ్రూప్‌–1లో విజేతగా నిలిచారు. డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమె రాష్ట్ర స్థాయిలో 8, ఉత్తరాంధ్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఆమె గత మూడేళ్లుగా జిల్లా బీసీ సంక్షేమాధికారిగా పనిచేస్తున్నారు. రెండో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నారు. కీర్తికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

ఉపాధ్యాయురాలిగా కూడా..
2008 డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. ఎనిమిదేళ్లపాటు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించారు. ఉద్యోగం వచ్చిందన్న ఉద్దేశంతో ఆమె లక్ష్యానికి దూరం కాలేదు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే మరోపక్క గ్రూప్‌-1 కోసం కృషిచేశారు. పాఠశాల ముగిసిన వెంటనే చదువుకోవడంలో నిమగ్నమయ్యేవారు. 

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

వివాహం కావడంతో..
వివాహం కావడంతో మరోపక్క కుటుంబ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించారు. 2011 ఉద్యోగ ప్రకటనలో గ్రూప్‌-1 రాసి విజయం సాధించినా ఆర్డీఓ అవ్వాలన్న లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయారు. 2018లో జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిణిగా ఎంపికయ్యారు. దీంతో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిణిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా విధుల్లో ఉన్నారు. జిల్లా స్థాయి అధికారిణిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికీ ఆమె తన సాధనను వీడలేదు. సెలవు రోజుల్లోనూ, ఖాళీ సమయాల్లోనూ గ్రూప్‌-1కు సాధన చేసేవారు. ఆర్డీఓ అవ్వాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

Success Story: గ్రూప్‌-1లో టాప్ ర్యాంక్‌ కొట్టానిలా..

#Tags