TSPSC Group 1 Prelims Key 2022 : నేడే టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుద‌ల..! అలాగే ఓఎంఆర్‌ షీట్లను కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన‌ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష కీ ని విడుద‌ల లైన్ క్లీయ‌ర్ అయింది. ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ ని అక్టోబ‌ర్ 28వ తేదీన‌ విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు తెలిసింది.

ఈ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను కూడా https://websitenew.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

☛ TSPSC Group 1 - 2022 Question Paper with Key (Held on 16.10.2022 )

అభ్యర్థుల్లో ఇంకా..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై అభ్యర్థుల్లో ఇంకా గందరగోళం వీడలేదు. ఈ గందరగోళానికి రేప‌టితో తెర‌ప‌డ‌నున్న‌ది. ఎందుకంటే.. రాసిన ప్రశ్నలకు సరైన జవాబులపై అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక కీ విడుదలైతే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. 

TSPSC Group 1 Prelims 2022 Subject Wise Weightage : గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో.. ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై ఇప్పటికీ అభ్యర్థుల్లో గందరగోళమే కనిపిస్తోంది. ఒకే ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉండటమే దీనికి కారణమని.. కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు, మూడు సరైన సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఇక ఒకే ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు అడుగుతూ వాటిని జతపర్చాలని సూచించారని అంటున్నారు. విభిన్న రకాలుగా ప్రశ్నలు ఇవ్వడంతో సరైన సమాధానాలను గుర్తించడంలో ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.

Group 1 Prelims Cut Off Marks : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ 2022 కటాఫ్‌ మార్కులపై టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన‌ క్లారిటీ ఇదే..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం అక్టోబ‌ర్ 16వ తేదీన 1,019 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ ప‌రీక్ష‌కు 2,86,051 (75%) మంది దీనికి హాజరయ్యారు.

ప్రిలిమినరీలో అర్హత సాధించే అభ్యర్థులు మెయిన్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక పోస్టుకు 50 మంది చొప్పున (1:50 నిష్పత్తి ప్రకారం) మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీనిలో కటాఫ్‌ మార్కుల పద్ధతి లేదు. మెరిట్‌ జాబితా ప్రకారం మెయిన్‌కు ఎంపిక చేయనున్నారు.

TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్‌-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..

5 రోజుల పాటు..
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసిన తర్వాత దానిపై 5 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది. వాటిపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి, తుది 'కీ'ని ప్రకటించనున్నారు. దాంతో పాటు ఫలితాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

#Tags