RS Praveen Kumar : జూన్ 9వ తేదీన నిర్వ‌హించే.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయాల్సిందే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) జూన్ 9వ తేదీ (ఆదివారం) నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయాలని... అభ్య‌ర్థుల‌తో పాటు.. భారాస నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్ కూడా డిమాండ్‌ చేశారు.

Intelligence Bureau Exam కూడా ఆదే రోజు నిర్వ‌హించ‌నున్నారు. దీంతో జూన్ 9వ తేదీ గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించొద్దని ఆయ‌న డిమాండ్ చేశారు. చాలా మంది నిరుద్యోగులు ఐబీ పరీక్ష రాస్తున్నారని ఆయ‌న తెలిపారు. అలాగే లోక్‌స‌భ‌ ఎన్నికల కారణంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్‌-1కు సన్నద్ధం కాలేదని చెప్పారు.

అలాగే జూన్ 16వ తేదీన కూడా..
అలాగే ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు వచ్చాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 కోసం దరఖాస్తులు చేసుకొన్న వారిలో నిరుద్యోగులతో పాటు ఇన్‌ సర్వీసు ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇన్‌ సర్వీస్‌ ఉద్యోగులు ఎన్నికల డ్యూటీలలో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చింది. నిరుద్యోగులది కూడా అదే పరిస్థితి. ఎన్నికల వేళ ప్రిపేర్‌ కాలేదని.. ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.ఈక్రమంలోనే ప్రిలిమినరీ పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేసి.. తమకు న్యాయం చేయాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీలను గ్రూప్‌-1 అభ్యర్థులు కోరారు. అలాగే జూన్ 16వ తేదీ యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే సివిల్స్ ప్రిలిమ్స్ ప‌రీక్ష కూడా ఉంది. ఇలా అన్ని ప‌రీక్ష‌లు వెనువెంట‌నే ఉండ‌డంతో.. అభ్య‌ర్థులు ప్రిప‌రేష‌న్ కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు.

#Tags