TS Assembly Speaker Gaddam Prasad Kumar : తెలంగాణ తొలి దళిత స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌.. ఈయ‌న బ్యాక్ గ్రౌండ్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ అసెంబ్లీ శాసనసభ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్‌ పార్టీ తరఫు నుంచి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ వేశారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, దాని మిత్ర పక్షం మజ్లిస్‌ సైతం స్పీకర్‌ ఎన్నికకు సహకరిస్తామని ప్రకటించింది.

గడువు ముగియడంతో ఆయన స్పీకర్‌ కావడం ఖాయమైంది. శాసనసభ స్పీకర్‌ ఎన్నిక నామినేషన్ల కోసం డిసెంబ‌ర్ 13వ తేదీన‌(బుధ‌వారం)ఆఖరి రోజుకాగా.. ఒకే ఒక నామినేషన్‌ దాఖలు అయ్యింది. దీంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నిక దాదాపు ఖరారు అయినట్లే. ప్రొటెం స్పీకర్‌ రేపు(గురువారం డిసెంబర్‌ 14)న శాసన సభలో స్పీకర్‌ ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు.

☛ Telangana CM Revanth Reddy Success Story : డైరెక్ట్ ఎమ్మెల్యే టూ..ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. స‌క్సెస్ జ‌ర్నీ ఇదే..

ఈయ‌న బ్యాక్ గ్రౌండ్ ఇదే..

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ స్వస్థలం వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామం. తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య.  తాండూర్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్‌ రెండుసార్లు వికారాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తొలిసారి ఆయన నెగ్గింది 2008 ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పని చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడారు. ఆపై కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షుడిగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్‌ అవుతారు.

☛ Telangana Government Jobs Latest News : బ్రేకింగ్ న్యూస్‌... తెలంగాణ‌లో టీస్‌పీఎస్సీ గ్రూప్‌-1,2,3,4 ప‌రీక్ష‌ల‌న్నీ రీ షెడ్యూల్‌.. కొత్త తేదీలు ఇవే..! అలాగే డీఎస్సీ కూడా..

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

చ‌ద‌వండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్‌

☛ APPSC/TSPSC Group-2 Jobs Success Tips 2023 : గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags