Bharat Bhushan Awards 2023: భారత్‌ భూషణ్‌ అవార్డుకు ఐటీ శ్రీధర్‌ ఎంపిక..

ఎపిటా ఐటీ ప్రమోషన్స్‌ జీఎం వి.శ్రీధర్‌రెడ్డి దాదాపు నాలుగేళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అసలు ఆయన అందించిన సేవలేంటి..? వివరాలను పరిశీలించండి..

రాష్ట్ర ప్రభుత్వ ఐటీఈసీ విభాగంలోని ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ (ఎపిటా) జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీధర్‌రెడ్డి తాజాగా భారత్‌ భూషణ్‌–2023 అవార్డుకు ఎంపియ్యారు. మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన బీచ్‌ఐటీ కాన్సెప్ట్‌ను ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థలకు పరిచయం చేయడంలో శ్రీధర్‌రెడ్డి ముఖ్యభూమిక వహించారు. విశాఖ కేంద్రంగా గతేడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023లో ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడంలోనూ శ్రీధర్‌ రెడ్డి పాత్ర ఎంతో ఉంది.

Teachers: ఉపాధ్యాయులకు కలెక్టర్‌ ఆదేశం..!

ఐటీ రంగంలో శ్రీధర్‌రెడ్డి అందించిన సేవలకు గతేడాది సెప్టెంబర్‌లో మింట్‌బిజినెస్‌ అందించే మోస్ట్‌ ప్రామినెంట్‌ ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ ఇండస్ట్రీ లీడర్‌–2023కి ఏపీ నుంచి ఎంపికయ్యారు. అదేవిధంగా ఏపీలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ఐటీ, ఫైనాన్స్‌ రంగంలో అందిస్తున్న సేవలకు గానూ బ్రిటిష్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌మేరీ గౌరవ డాక్టరేట్‌ను అక్టోబర్‌లో అందజేసింది. అదే నెలలో ఇండియన్‌ ఎచీవర్స్‌ ఫోరమ్‌ శ్రీధర్‌రెడ్డిని మేన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌–2023 అవార్డును అందించింది. అంతర్జాతీయ సంస్థ ది గ్లోబల్‌ చాయిస్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఐటీ పేరుతో సత్కరించింది.

NALSAR విశ్వవిద్యాలయంలో కార్పొరేట్ గవర్నెన్స్‌ మొదటి జాతీయ పరిశోధనా సదస్సు

ఇటీవల థాయ్‌లాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఎచీవర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఐటీ అండ్‌ ఫైనాన్స్‌లో అవుట్‌స్టాండింగ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును అందజేసింది. తాజాగా అంబేద్కర్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ ప్రతిష్టాత్మక భారత రత్న డా. బీఆర్‌ అంబేడ్కర్‌ భారత్‌ భూషణ్‌–2023 అవార్డుతో శ్రీధర్‌రెడ్డిని సత్కరించింది. లండన్‌ పార్లమెంట్‌ సైతం మహాత్మా గాంధీ మెడల్‌ని అందజేసింది. వీటితో పాటు అనేక అవార్డులు ఈ ఏడాది శ్రీధర్‌రెడ్డి దక్కించుకున్నారు.

Suchindra Rao: సైన్స్‌ ఫెయిర్‌కు సన్నద్ధం

దేశవిదేశాల అవార్డులు సొంతం చేసుకుంటున్న శ్రీధర్‌రెడ్డి

తాజాగా భారత్‌ భూషణ్‌–2023 అవార్డు

ఐటీలో గ్లోబల్‌ లీడర్‌గా ఏపీ

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌తో విశాఖలోనూ, ఐటీ పార్కులతో విజయవాడ, తిరుపతి నగరాల్లో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నా. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక లక్ష్యాలకు అనుగుణంగా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు వ్యూహాలను నిర్దేశించుకున్నాను. ప్రభుత్వం నాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి బాధ్యతలు అప్పగించింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్న ఏపీని.. ఐటీ రంగంలోనూ గ్లోబల్‌ లీడర్‌గా నిలబెట్టాలన్నదే నా ఆకాంక్ష.

– వి.శ్రీధర్‌రెడ్డి ఎపిటా (ఐటీ ప్రమోషన్స్‌) జీఎం

Degree Exams: డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్‌

                                                         

#Tags