Nobel Prize Winner: బంగ్లాదేశ్‌ ఆర్థిక వేత్తకు ఆరు నెలల జైలు శిక్షను విధించిన కోర్టు.. కారణం?

బంగ్లాదేశ్‌కు చెందిన ఆర్థిక వేత్త మహ్మద్‌ యూనస్‌కు కోర్టు ఆరు నెలల జైలు ను ప్రకటించింది. అందుకు ఇదే కారణం..

బంగ్లాదేశ్‌ ఆర్థిక వేత్త, నోబుల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ మహ్మద్‌ యూనస్‌(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్‌ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్‌ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు.

Moon Lighting: మూన్‌ లైటింగ్‌.. ఏడాదికి రూ.2.5 కోట్లు సంపాదించిన ఐటీ ఉద్యోగి.. అత‌ను ఎవ‌రంటే..!

అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్‌ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

#Tags