Muhammad Yunus: బంగ్లాదేశ్ సారథిగా మహ్మద్ యూనుస్
Sakshi Education
నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్(84)ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమితులయ్యారు.
ఈ హోదా ప్రధానమంత్రితో సమానమైనది. ఆగస్టు 8వ తేదీ అధ్యక్ష భవనం ‘బంగభవన్’లో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. యూనుస్‌కు 16 మందితో కూడిన సలహాదారుల మండలి పాలనలో సహకరించనుంది.
ఈ మండలికి ఎంపికైన వారిలో రిజర్వేషన్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మూద్‌తోపాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీదా అఖ్తర్ తదితరులున్నారు. వీరితో కూడా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. పౌరులకు భద్రత కల్పించడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు తనకు సాయపడాలని యూనుస్ ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరారు.
Bangladesh Political Crisis: రాజీనామా చేసి దేశం వీడిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా!
Published date : 10 Aug 2024 09:02AM
Tags
- Bangladesh crisis
- Muhammad Yunus
- interim government
- Nobel laureate
- President Mohammed Shahabuddin
- Bangladesh
- Bangladesh Nationalist Party
- Sakshi Education Updates
- President Mohammad Shahabuddin
- Oath Ceremony
- Bangladesh politics
- Yunus appointment news
- August 8 oath ceremony
- mohammad yunus
- International News in Telugu