Daniel Kahneman: ప్రముఖ సైకాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత కన్నుమూత
Sakshi Education
ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కానమన్ (90) మార్చి 27వ తేదీ మరణించారు.
ఈ విషయాన్ని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రకటించింది. 1993వ సంవత్సరం నుంచి కానమన్ అక్కడే పని చేస్తున్నారు. ఆర్థిక శాస్త్రం చదవకపోయినా ప్రవర్తనా ఆర్థికశాస్త్రానికి ఆయన పర్యాయపదంగా మారారు. హిబ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కాలంబియా, MIT లో పాఠ్యాధ్యాపకుడిగా పనిచేశారు.
ఆయన రాసిన పుస్తకం ‘థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో’ ఎంతో ప్రజాదరణ పొందింది. డేనియల్ కానమన్ సిద్ధాంతాలు సామాజికశాస్త్రాలను చాలా మటుకు మార్చివేశాయని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్డార్ షాఫిర్ పేర్కొన్నారు. 1934లో ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌లో కానమన్ జన్మించారు.
New Election Commissioners: కొత్త ఎలక్షన్ కమిషనర్లు వీరే..
Published date : 29 Mar 2024 06:00PM