International Day of Families: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏప్పుడు జ‌రుపుకుంటారు?

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మే 15న విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తుంటారు.
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను తెలియజేయడం కోసం ఈ రోజును అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.కుటుంబ వ్యవస్థ బలహీనమవడం మూలం గా సమాజంలో జరిగే నష్టాలను, పరిణామాలను గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1989 డిసెంబర్ లో ప్రతి సంవత్సరం మే 15న అంతర్జాతీ య కుంటుంబ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. కష్టాలు వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే చేర్చించుకుంటాం. అదే కుటుంబమే లేని రోజు మన బాధలు, మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా, ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి. కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం.

#Tags