Skip to main content

Akshaya Patra Foundation: అక్షయపాత్ర ఫౌండేషన్ 400 కోట్ల భోజనాల మైలురాయి!!

ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అక్షయపాత్ర ఫౌండేషన్ 400 కోట్ల భోజనాలను పేద పిల్లలకు అందించిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఘనంగా సత్కారం జరిగింది.
Akshaya Patra Foundation   Milestone achievement  Akshaya Patra Foundation’s 4 billion meals milestone commemorated at the UN

శీర్షిక: ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి సాధనలో భారత్‌ విజయాలు
ప్రధాన అతిథులు: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి, అక్షయపాత్ర ఫౌండేషన్‌ అధ్యక్షుడు మధు పండిత్‌ దాస

ప్రధాన మంత్రి మోదీ సందేశం: 400 కోట్ల భోజనాల మైలురాయిని అధిగమించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌ను అభినందిస్తూ సందేశం పంపారు.

భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ వ్యాఖ్యలు: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాలుగోదైన ఆకలి నిర్మూలనలో భారత్‌ కృషికి ఇది నిదర్శనమని అన్నారు.

అక్షయపాత్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ మధుపండిత్‌ దాస ప్రసంగం:

➢ భారీఎత్తున వంట, ఆహార పంపిణీకి తాము ఉపయోగిస్తున్న అధునాతన పరిజ్ఞానాన్నీ, అనుభవాన్ని ప్రపంచంలోనిఇతర దేశాలు, సంస్థలతో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
➢ తుర్కియే భూకంపంలోనూ, ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ ఆర్తులకు అన్నపానాదులు అందిస్తున్నామని వివరించారు.
➢ భారత్‌లో అక్షయపాత్ర 72 వంటశాలలను నిర్వహిస్తోందని, గత 24 ఏళ్లలో 24,000 పాఠశాలల్లోని 21 లక్షల మందికి రోజూ భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.

Amul Milk: విదేశీ మార్కెట్లలో అమూల్ పాలు.. తొలిసారిగా ఇక్క‌డే!

Published date : 05 Apr 2024 05:54PM

Photo Stories