Nobel Prize Winners Gifts: నోబెల్‌ విజేతలకు అందించే కానుకలు ఏంటో తెలుసా

నోబెల్ బహుమతి విజేతలు ఈ బహుమతితో పాటు అనేక ఇతర కానుకలు అందుకుంటారు.
Nobel Prize Winners Gifts

ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ బహుమతి కింద వారికి ఊహకందనంత నగదు వారికి లభిస్తుంది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా వీరికి అత్యంత ఆదరణ లభిస్తుంది. ఈసారి నోబెల్ బహుమతి పొందిన వారందరికీ 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్ అందించారు. డాలర్లలో చూస్తే దాదాపు 9.86 డాలర్లు. భారతీయ రూపాయిలలో చూస్తే  8 కోట్ల రూపాయలకంటే అధికం. నోబెల్‌ విజేతలకు డబ్బుతో పాటు బంగారు పతకాన్ని, సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు.

Nobel Prize Physiology or Medicine 2023: వైద్య శాస్త్రంలో కాటలిన్‌, వెయిస్‌మన్‌కు నోబెల్

2020 సంవత్సరంలో ఈ మొత్తం ఒక కోటి స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2017వ సంవత్సరంలో ఇది 90 లక్షల స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2012లో నోబెల్ విజేతలకు 80 లక్షల స్వీడిష్ క్రోనార్లను అందించారు. దీని ప్రకారం చూస్తే కాలక్రమేణా బహుమతిగా వచ్చే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. 1901లో మొదటిసారి నోబెల్ బహుమతిని అందించినప్పుడు, ఒక్కో కేటగిరీ ప్రైజ్ మనీ 150,782 స్వీడిష్ క్రోనార్‌గా ఉండేది. అంటే ఆ మొత్తాన్ని ప్రస్తుత భారతీయ రూపాయల్లోకి మారిస్తే రూ.11 లక్షలకు పైగానే ఉంటుంది. అంటే తొలిసారి నోబెల్‌ బహుమతి మొత్తం రూ. 11 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ. 8 కోట్లకు పెరిగింది.

Nobel Prize Money: నోబెల్ పురస్కారం నగదు భారీగా పెంపు

#Tags