Skip to main content

Grammy Awards 2024 Winners From India : ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు 2024.. భార‌త్ నుంచి విజేత‌లు వీరే..

సాక్షి ఎడ్య‌కేష‌న్ : ఎంతో ప్రతిష్టాత్మక‌మై.. గ్రామీ అవార్డులు 2024లో భారత్‌ సత్తా చాటింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన‌ అత్యంత ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా నిర్వహించిన గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొన్నారు.
Grammy Awards 2024 Winners Details

ఇక గ్రామీ అవార్డుల వేడుక ఆద్యంతం అద్భుతమైన పాటలతో, అందరిని ఆకట్టుకుంటూ కొనసాగింది .

భార‌త్ నుంచి..
66వ గ్రామీ అవార్డుల్లో పాష్తోకి గాను ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మూడు అవార్డుల‌ను గెలుచుకుని చ‌రిత్ర సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మ‌క‌మైన మ్యూజిక్ అవార్డు షోకు స్టార్ సింగ‌ర్ ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ 66వ వార్షిక గ్రామీ అవార్డులు 2024కి ఫ్యూజన్ బ్యాండ్ 'శక్తి'కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ  దిగ్గజ సంగీత విద్వాంసులు  ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ , సెల్వగణేష్‌ వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్‌తో కూడిన  సూపర్ గ్రూప్ ‘శక్తి’   బ్యాండ్‌ అవార్డును దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం  వ్యక్తమవుతోంది. ఈ బృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులకు ప్రపంచఖ్యాతి  దక్కడం విశేషం.

☛ Oscar Nominations 2024: ఆస్కార్‌ నామినేషన్స్‌ 2024.. ఈసారి పోటీ పడుతున్న సినిమాలు ఇవే..!

శక్తి  బ్యాండ్‌ ఆవిర్భావం ఇలా..
మహావిష్ణు ఆర్కెస్ట్రా  రద్దు తరువాత 1973లో ఫ్యూజన్ బ్యాండ్, శక్తి  బ్యాండ్ ఏర్పడింది. ఇందులో ఉస్తాద్‌ జాకీర్ హుస్సేన్​(తబ్లా) ప్రముఖ సింగర్‌ శంకర్‌ హదేవన్,గిటారిస్ట్‌ జాన్ మెక్‌లాఫ్లిన్, వి సెల్వగణేష్ , వయోలనిస్ట్‌ గణేష్ రాజగోపాలన్ వంటి ప్రఖ్యాత  కళాకారులున్నారు. చాలా ఏళ్ల తరువాత 2020లో  దీన్ని  సంస్కరించారు. అలాగే మూడేళ్ల తరువాత తొలి ఆల్బమ్ ‘దిస్ మూమెంట్‌’జూన్ 23, 2023లో  రిలీజ్‌ అయింది.  తాజా ఆల్బమ్‌లో శ్రీనిస్ డ్రీమ్, బెండింగ్ ద రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పాల్మాస్‌తో సహా 8 ట్రాక్‌లు ఉన్నాయి.

భార‌త్ ప్రధాని నరేంద్ర మోదీ కూడా..
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళాకారులు విజయకేతనం ఎగరేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సంగీత కళాకారులు జాకీర్‌ హుస్సేన్‌(తబలా),శంకర్‌ మహదేవన్‌ (సింగర్‌)లు ఉన్న శక్తి బ్యాండ్‌కు తాజాగా గ్రామీ అవార్డు దక్కింది. వీళ్లు కంపోజ్‌ చేసిన ‘దిస్‌ మూమెంట్‌’ ఉత్తమ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ అవార్డును సొంతం చేసుకుంది. సంగీతం పట్ల మీ అసాధారణమైన ప్రతిభ, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాయి. భారతదేశం గర్విస్తోంది. మీ కృషికి ఈ విజయాలే నిదర్శనం అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 

☛ Oscar Award Winners From India : ఇప్పటివరకు భార‌త్ నుంచి ‘ఆస్కార్’ సాధించిన వీరులు వీరే...

దిస్‌ మూమెంట్‌ పాటను జాన్‌ మెక్‌లాఫ్లిన్‌ (గిటార్‌), జాకిర్‌ హుస్సేన్‌ (తబలా), శంకర్‌ మహదేవన్‌(సింగర్‌), గణేశ్‌ రాజగోపాలన్‌ (వయోలిన్‌) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్‌ పేరిట కంపోజ్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీని ఎదుర్కొని ‘శక్తి’ విజేతగా నిలవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

అంతకు ముందు.. శంకర్‌ మహదేవన్‌ మాట్లాడుతూ ‘నాకు ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ఆనందం వ్యక్తం చేశారు.

మ్యూజిక్ మాస్ట్రో ఏర్‌ రెహమాన్‌..

Grammy Awards 2024 Winners From India News in Telugu

గ్రామీ అవార్డుపై శుభాకాంక్షలు తెలిపిన అస్కార్‌ విన్నర్‌ మ్యూజిక్ మాస్ట్రో ఏర్‌ రెహమాన్ ఇండియాకు గ్రామీ అవార్డుల వర్షం కురుస్తోందంటూ ఇన్‌స్టాలో ఒక సెల్ఫీని పోస్ట్‌ చేశారు. మాజీ గ్రామీ విజేత  కూడా అయిన రెహ్మాన్‌, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ ,వితో కలిసి ఉన్న సెల్ఫీని  షేర్‌ చేశారు. అటు  గ్రామీ అవార్డును గెలుచుకున్న సందర్భంగా శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్,  సంగీత కుటుంబానికి, ఫ్యాన్స్‌తోపాటు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని అభినందనల్లో ముంచెత్తారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఘనాపాటీ ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి రెండవ గ్రామీని గెలుచుకున్నారని పేర్కొన్నారు .దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

☛ Grammy Awards 2023 : 65వ గ్రామీ అవార్డు విజేత‌లు వీరే.. మూడోసారి ఈ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్ ఈత‌నే..

లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి బ్యాండ్‌కు చెందిన పాష్టో పాట ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్‌గా గౌరవనీయమైన గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది. పాష్టోకు చెందిన యాస్ వి స్పీక్ ఉత్తమ సమకాలీన వాయిద్య ఆల్బమ్‌ అవార్డు కూడా గెలుచుకుంది. అంతేకాదు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

☛ Grammys Winners 2022: గ్రామీ పురస్కారం గెలుచుకున్న భారత సంతతి కళాకారులు?

Published date : 06 Feb 2024 08:35AM

Photo Stories