Grammy Awards 2023 : 65వ గ్రామీ అవార్డు విజేతలు వీరే.. మూడోసారి ఈ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్ ఈతనే..
2015, 2022లోనూ కేజ్‌కు గ్రామీ అవార్డులు వరించాయి. దీంతో మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడుగా కేజ్ నిలిచారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అత్యధికంగా 31 గ్రామీ అవార్డులు పొందిన సెలబ్రిటీగా జార్జ్ సాల్టి ఉండేది. తాజాగా అమెరికన్ సింగర్, డ్యాన్సర్ బియాన్స్ 32 అవార్డులతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది.
➤ Padma Awards 2023 : ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఈ సారి తెలుగు తేజాలకు..
ఈ ఏడాది గ్రామీ విజేతలు వీరే..
☛ బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్: రిక్కీ కేజ్
☛ బెస్ట్ పాప్ డ్యుయో పర్ఫామెన్స్ - సామ్ స్మిత్, కిమ్ పెట్రాస్
☛ సాంగ్ ఆఫ్ ద ఇయర్ : బోనీ రైట్
☛ బెస్ట్ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆల్బమ్: రెనిసాన్స్(బియాన్స్)
☛ బెస్ట్ పాప్ సోలో పర్ఫామెన్స్: అదెలె
☛ బెస్ట్ ర్యాప్ ఆల్బమ్: కెన్‌డ్రిక్ లామర్ (మిస్టర్ మొరాలే, బిగ్ స్టెప్పర్స్)
☛ బెస్ట్ మ్యూజిక్ అర్బన్ ఆల్బమ్: బ్యాడ్ బన్నీస్ అన్ వెరానో సిన్‌టి
☛ బెస్ట్ కంట్రీ ఆల్బమ్ విన్నర్: ఎ బ్యూటిఫుల్ టైమ్
☛ బెస్ట్ ఆర్ అండ్ బి సాంగ్: కఫ్ ఇట్ (బియాన్స్)
☛ బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్: హ్యారీ స్టైల్స్
ఈ పురస్కారాన్ని భారత్‌కు అంకితమిస్తున్నా.. : రిక్కీ కేజ్
సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో భారత్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ తన సత్తా చాటాడు. ఇప్పటికే రెండు సార్లు గ్రామీ పురస్కారాలను అందుకున్న ఆయన తాజాగా మరోసారి అవార్డును ఎగరేసుకుపోయారు. బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ కేటగిరీలో 'డివైన్ టైడ్స్'కు గానూ గ్రామీ అవార్డు పొందారు. ఈ పురస్కారాన్ని డివైన్ టైడ్స్‌కు పనిచేసిన డ్రమ్మర్ స్టీవార్ట్ కోప్‌ల్యాండ్‌తో షేర్ చేసుకున్నారు. కాగా మూడు గ్రామీ అవార్డులు సాధించిన ఏకైక భారతీయుడిగా రిక్కీ రికార్డు నెలకొల్పారు.ఈ సంతోషకర క్షణాలను ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు రిక్కీ. 'మూడో గ్రామీ అవార్డు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. ఈ పురస్కారాన్ని భారత్‌కు అంకితమిస్తున్నా' అని ట్వీట్ చేశారు. ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ కేటగిరీలో క్రిస్టినా, నిదరోస్‌డోమెన్స్ జెన్‌టెకర్, ట్రోండ్ హెమ్సోలిస్టెన్, ద చైన్‌స్మోకర్స్, జేన్ ఐరాబ్లూమ్ బ్యాండ్‌ట్రూప్స్ పోటీపడ్డాయి. కానీ వీటన్నింటిని వెనక్కు నెట్టి కేజ్ విజయ బావుటా ఎగురవేశారు.
ఈయన 8 ఏళ్ల వయసులోనే..
అమెరికా ఉత్తర కెరోలినాలో 1981లో భారతీయ దంపతులకు రిక్కీ కేజ్ జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే వారు స్వదేశానికి వచ్చి బెంగళూరులో సెటిలయ్యారు. బెంగళూరులోని ఆక్స్‌ఫర్డ్ డెంటల్ కాలేజీలో రిక్కీ కేజ్ డిగ్రీ పూర్తి చేశారు. 2015లో మొదటిసారి గ్రామీ అవార్డు పొందారు. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో విండ్స్ ఆఫ్ సంసారాకు ఈ పురస్కారం పొందారు. 2022లో ఇదే కేటగిరీలో డివైన్ టైడ్స్‌కుగానూ అవార్డు అందుకున్నారు. తాజాగా డివైన్ టైడ్స్‌కు మరోసారి అవార్డు అందుకోవడం విశేషం. ఇకపోతే చిన్న వయసులోనే గ్రామీ అవార్డు పొందిన భారతీయ వ్యక్తిగా అందరి దృష్టి ఆకర్షించారు రిక్కీ కేజ్.