Skip to main content

Oscar Award Winners From India : ఇప్పటివరకు భార‌త్ నుంచి ‘ఆస్కార్’ సాధించిన వీరులు వీరే...

ప్ర‌పంచ‌ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులకు ఈ ఏడాది అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అమెరికాలోని లాస్‌ ఏంజిలస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు.
oscar award winners from india in telugu
oscar award winners from india details

95వ ఆస్కార్‌ వేడుకల్లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారు ఆస్కార్‌ని గెలుపొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేప‌థ్యంలో.. ఇప్పటిదాకా ఎంతమంది భారతీయులు ఆస్కార్ గెలిచారు? వీరి స‌మ‌గ్ర వివ‌రాలు మీకోసం..

☛➤ Oscar Awards 2023 Winners Details Telugu : అస్కార్‌ విజేతలు 2023 వీరే.. చరిత్ర సృష్టించిన ‘RRR’..

ఇప్పటివరకు ‘ఆస్కార్’ అవార్డులు సాధించిన భారతీయులు వీరే..

oscar award winners in india movie telugu news

చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్(అకాడమీ) అవార్డులు ఈ ఏడాది ఎంతో ఘ‌నంగా జరిగాయి. ఇది 95వ ఆస్కార్ వేడుక. ఇన్నేళ్ల ఆస్కార్ జర్నీలో అవార్డులు అందుకున్న భారతీయుల సంఖ్య చాలా తక్కువ. ప్రతీ ఏటా జరిగినట్లే.. ఈసారి కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల సినిమాలు ఆస్కార్ ని గెలిచేందుకు ప్రయత్నాలు చేశాయి. ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగాయి. కాగా.. నాటు నాటు సాంగ్, ది ఎలిఫెంట్ విస్ఫరర్స్ ఈసారి ఇండియా నుంచి ఆస్కార్ గెలిచాయి. మరి ఇప్పటిదాకా ఏయే సినిమాలు/ఎంతమంది భారతీయులు ఆస్కార్ గెలిచారు? అనేది చూద్దాం!

☛➤ Oscars 2023: ఒకే సినిమాకు 7 ఆస్కార్ అవార్డులు

1983లో.. భాను అథైయాకి ఆస్కార్.. ఈ కేటగిరిలో.. : 

oscar award winner Bhanu Athaiya

1983లో మొదటిసారి ఇండియాకి ఆస్కార్ పురస్కారాన్ని భాను అథైయా. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకి గానూ ‘బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్’గా భాను ఆస్కార్ గెలుపొందారు. ఈ సినిమాకి భానుతో పాటు ఇంగ్లాండ్ కి చెందిన జాన్ మొల్లో కూడా కాస్ట్యూమ్స్ కి వర్క్ చేసి ఆస్కార్ అందుకున్నారు. గాంధీ సినిమా.. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కింది. 

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించిన భాను అసలు పేరు.. భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యాయ్. ఈమె గాంధీతో పాటు లగాన్, లేకిన్, స్వదేశ్, 1942 ఏ లవ్ స్టోరీ.. లాంటి బిగ్ హిట్స్‌కి వర్క్ చేశారు. చివరికి 2020లో కన్నుమూశారు. (గాంధీ మూవీకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో సితారిస్ట్ రవి శంకర్ నామినేట్ అయ్యారు).

☛➤ Oscar Awards: 22 ఏళ్ల తర్వాత ఆస్కార్‌కు ఇండియన్‌ మూవీ... ఓ నటుడిని నగ్నంగా నిలబెట్టి మరీ అవార్డు డిజైన్‌.. ఆ నటుడు ఎవ‌రో తెలుసా..?

1992లో.. ది లెజెండరీ ఫిలిం మేకర్‌  సత్యజిత్ రేకు.. :

satyajit ray oscar winners telugu news

ఇండియన్ సినీ చరిత్రలో శాశ్వతంగా తన పేరును నిలుపుకున్న లెజెండరీ ఫిలిం మేకర్స్ లో సత్యజిత్ రే ఒకరు. కెరీర్ లో దాదాపు 36 సినిమాలను తెరకెక్కించి.. సినీ రంగానికి విశేష సేవలందించినందుకు.. 1992లో ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ సత్యజిత్ రేని హానరరీ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు సత్యజిత్ రే. ఆస్కార్ వరించిన అదే ఏడాది అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన తెరకెక్కించిన పథేర్ పాంచాలి, అపరాజితో, పరశ్ పాతర్, దేవి, అపూర్ సన్సార్, కాంచనజంగా, చారులత.. లాంటి చాలా సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి.

☛➤ Oscar Award Winners 2022: ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. భార‌త్‌కు..

2009 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో.. గుల్జార్‌కు..

Slumdog Millionaire’s gulzar oscar winner telugu news

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గుల్జార్.. ఆస్కార్ అందుకున్నారు. ఈ సినిమాలో ‘జయహో’ సాంగ్ లిరిక్స్ కి గాను గుల్జార్ ఆస్కార్ గెలిచారు. ఈయన గురించి ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా, రచయితగా, లిరిసిస్ట్ గా సేవలందించారు.

2009లో.. రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తి.. ఏఆర్ రెహమాన్

ar rahman slumdog millionaire Oscar telugu news

ఇప్పటివరకు ఇండియా నుంచి రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తి రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకి గాను ఒరిజినల్ సాంగ్(జయహో), ఒరిజినల్ స్కోర్ కేటగిరిలలో రెహమాన్ రెండు ఆస్కార్ లను అందుకొని చరిత్రలోకెక్కారు. ఆ తర్వాత 2011లో 127 అవర్స్ మూవీకి గాను రెహమాన్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్కోర్ కేటగిరిలలో నామినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటిదాకా ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను ఖాతాలో వేసుకున్నారు.

☛➤ ఆస్కార్ అవార్డులు-2020

17 ఏళ్ల త‌ర్వాత‌...
2009లో జరిగిన 81వ ఆస్కార్‌ వేడుకలో ఏకంగా మూడు ఆస్కార్‌ అవార్డులు.. ముగ్గురు భారతీయులకు ద‌క్కాయి. స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌ చిత్రానికి బెస్ట్‌ సౌండింగ్‌ మిక్సింగ్‌ కేటగిరీలో రసూల్‌.. రిచర్డ్‌ ప్రైక్‌, ఇయాన్‌ ట్యాప్‌తో కలిసి ఆస్కార్‌ పురస్కారం స్వీకరించారు. ముసాఫిర్‌ (హిందీ) సినిమాతో 2004లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన రసూల్‌ తమిళ్‌, మలయాళం, కన్నడ, తెలుగు (పుష్ప, రాధేశ్యామ్‌) చిత్రాలకు సౌండ్‌ మిక్సింగ్‌ చేశారు.

2009లో బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో.. రసూల్ పూకుట్టి..

resul pookutty slumdog millionaire telugu

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకి గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ గెలుపొందారు. ఆ సినిమాకి రిచర్డ్ ఫ్రెక్, ఇయాన్ ట్యాప్ లతో కలిసి రసూల్ ఈ అవార్డు అందుకున్నారు. కాగా.. రసూల్ పూకుట్టి.. ఇప్పటిదాకా ఎన్నో బిగ్గెస్ట్ మూవీస్ కి వర్క్ చేశారు. రోబో, రెమో, రోబో 2.o, ఒత్త సెరుప్పు సైజు 7, కేరళ వర్మ పలసి రాజా లాంటి సినిమాలు.. రసూల్ కి మంచి పేరు తీసుకొచ్చాయి.

2019లో.. గునీత్ మోంగా

Oscar for their documentary 'Period. End of Sentence.'

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో గునీత్ నిర్మించిన ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ 2019లో ఆస్కార్ గెలుపొందింది.

☛➤ ఆస్కార్ అవార్డులు-2019

తాజాగా.. 2023లో ఎంఎం కీరవాణికి..

rrr mm keeravani telugu news


95వ ఆస్కార్ వేడుకలలో ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నామినేట్ అయిన.. ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచింది. ఈ సాంగ్ ని ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ స్టేజ్ పై అవార్డులు అందుకున్నారు.

2023లో.. కార్తీకి గొన్సాల్వ్స్, గునీత్ మోంగాకి..

oscar kartiki gonsalves telugu news

95వ ఆస్కార్ వేడుకలలో ఇండియన్ ఫిలిం మేకర్స్ గునీత్ మోంగా, కార్తీకి గొన్సాల్వ్స్ రూపొందించిన ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ ఆస్కార్ గెలిచింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ని ఆస్కార్ వరించింది. ప్రొడ్యూసర్ గునీత్ మోంగాకి ఇది రెండో ఆస్కార్ అనే చెప్పాలి. 2019లో గునీత్ ప్రొడ్యూస్ చేసిన ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’కి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ గెలిచింది.

☛➤ Oscars 2023: భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్‌.. బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌'

 

Published date : 13 Mar 2023 02:19PM

Photo Stories