Oscars 2023: భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్.. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'
ఈ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ షార్ట్ ఫిలిమ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అవార్డు సాధించింది. ఈ మేరకు దర్శకురాలు కార్తీకి గోన్‌సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ్న అవార్డులను అందుకున్నారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి ఆస్కార్. ది ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిలిమ్ గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది.
తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. ఈ సినిమా డైరక్టర్ కార్తికీ గొన్సాల్వేస్ వయసు 37 సంవత్సరాలు. ఆమె ఈ డాక్యురీమెంటరీ కోసం తన బృందంతో కలిసి ఐదేళ్ల పాటు ఏనుగులతో జీవించారు. 42 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Oscar 2023: సత్తా చాటిన 'RRR'.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్