ఆస్కార్ అవార్డులు-2019
Sakshi Education
2018 సంవత్సరానికిగాను ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్‌ట్స అండ్ సెన్సైస్ (Academy of Motion Picture Arts and Sciences-AMPAS) ఫిబ్రవరి 25న ప్రదానం చేసింది.
అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్‌లో 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు. వ్యాఖ్యాత లేకపోయినా మాయ రుడాల్ఫ్, టినా ఫే, అమీ పోయిల్హర్ అవార్డ్ షోను విజయవంతంగా ప్రారంభించారు. 1989 తర్వాత వ్యాఖ్యాత లేకుండా ఆస్కార్ అవార్డుల ఉత్సవం జరగడం ఇది రెండో సారి.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ‘గ్రీన్‌బుక్’కు అవార్డు లభించింది. బొహెమియన్ రాప్సోడి’ చిత్రానికి నాలుగు,‘ రోమా’,‘ బ్లాక్ పాంథర్’ సినిమాలకు చెరి మూడు ఆస్కార్‌లు దక్కాయి. ఈ పురస్కారాల్లో భారతీయ డాక్యుమెంటరీ ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’కి అవార్డు దక్కింది.
భారతీయ ఫ్రెడ్డీ
భారతీయ మూలాలున్న వ్యక్తికి సంబంధించిన పాత్ర పోషించిన నటుడికి కూడా 91వ ఆస్కార్ అవార్డుల్లో ఓ పురస్కారం దక్కింది. బొహెమియన్ రాప్సోడీ చిత్రంలో ఫ్రెడ్డీ మెర్కూరీ పాత్రలో నటించినందుకు ఉత్తమ నటుడి అవార్డుకు రామి మలేక్ ఎంపికయ్యారు. ఆ చిత్రం ఫ్రెడ్డీ మెర్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కిందే.
అవార్డు విజేతల జాబితా
ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్
ఉత్తమ డెరైక్టర్: అల్ఫాన్సో క్వేరాన్ (రోమా)
ఉత్తమ నటుడు : రమీ మాలిక్ (బొహెమియన్ రాప్సోడి)
ఉత్తమ నటి: ఒలివియా కోల్మన్ (ద ఫెవరెట్)
ఉత్తమ సహాయ నటుడు: మహర్షెల్లా అలీ (గ్రీన్‌బుక్)
ఉత్తమ సహాయ నటి : రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
ఒరిజినల్ స్క్రీన్ ప్లే : గ్రీన్‌బుక్
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : బ్లాక్లాంన్స్‌మాన్ (స్పైక్ లీ)
ఉత్తమ విదేశీ చిత్రం : రోమా
యానీమేటెడ్ ఫీచర్ : స్పైడర్‌మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వర్స్
సౌండ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి
విజువల్ ఎఫెక్ట్స్ : ఫస్ట్‌మ్యాన్
ఫిల్మ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి
యానీమేటెడ్ షార్ట్: బావ్
లైవ్ యాక్షన్ షార్ట్: స్కిన్
డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్
ఒరిజినల్ స్కోర్ : బ్లాక్ పాంథర్
ఒరిజినల్ సాంగ్ : షాలో (ఏ స్టార్ ఈజ్ బార్న్)
ప్రొడక్షన్ డిజైన్: బ్లాక్ పాంథర్ (రూత్ కార్టర్)
సినిమాటోగ్రఫీ : రోమా (అల్ఫాన్సో క్వేరాన్)
క్యాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్ (హన్నా బీచ్లర్ )
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: వైస్ ( గ్రెగ్ కన్నమ్, కేట్ బిస్కోయి, పాట్రికా డిహానీ లీ)
డాక్యుమెంటరీ ఫీచర్: ఫ్రీ సోలో
సౌండ్ మిక్సింగ్ : బొహెమియన్ రాప్సోడి
డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్
భారత దేశంలో బహిష్టు సమయంలో స్త్రీలు ప్యాడ్స్ వాడే స్థితికి ఇంకా రాకపోవడం గురించి, నెలసరిపై సాంఘిక ప్రతిబంధకాలు ఉండటం గురించి తీసిన డాక్యుమెంటరీ ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెన్‌టెన్స్’ ఆస్కార్ బరిలో అవార్డు గెలుచుకుని వార్తలకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని కతిఖేరా గ్రామం(ఢిల్లీ సమీపం)లో కొంతమంది స్త్రీలు తయారు చేస్తున్న శానిటరీ ప్యాడ్స్ గురించి ఈ డాక్యుమెంటరీ తీశారు.

Published date : 26 Feb 2019 05:59PM