APRCET 2024 Notification: ఏపీఆర్‌సెట్‌ - 2024 నోటిఫికేషన్‌ విడుదల... పరీక్ష విధానం ఇలా..

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 16 యూనివర్శిటీల్లో పరిశోధనా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఏపీ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సెట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఏపీలోని వర్శిటీలు, రీసెర్చ్‌ సెంటర్‌లు, అనుబంధ కళాశాలల్లో పీహెచ్‌డీ(ఫుల్‌టైమ్‌/పార్ట్‌ టైమ్‌) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్స్, ఫైన్‌ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌-ప్లానింగ్, లా అండ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ తదితరాలు.
అర్హత: 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ
(సైన్స్, ఆర్ట్స్, మేనేజ్‌మెంట్, కామర్స్, లా, ఫార్మసీ, ఇంజనీరింగ్‌ తదితర కోర్సులు) ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించాలి. పీజీ చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు అర్హులే.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: ఏపీఆర్‌సెట్‌ అనేది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్‌ మార్కులు లేవు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరితేది: 19.03.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ తేదీలు: 04.04.2024 నుంచి 07.04.2024 వరకు.
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌ తేది: 10.04.2024.
పరీక్ష తేదీలు: ఏప్రిల్‌ 2024.

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/

చదవండి: TS ECET 2024 Notification: టీఎస్‌ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

#Tags