AP PGECET Notification 2024: ఏపీ పీజీఈసెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఏపీఎస్‌సీహెచ్‌ఈ).. ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(పీజీఈసెట్‌)–2024 నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫుల్‌టైం ఎంఈ,ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్‌.డి(పీబీ) కోర్సు­ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.ఈ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ నిర్వహించనుంది.

కోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్‌.డి(పీబీ)
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్, బయోఇన్ఫర్మేటిక్స్, బయో టెక్నాలజీ, బయో మెడికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, జియో–ఇన్ఫర్మేటిక్స్‌ తదితరాలు.
అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆలస్య రుసం లేకుండా దరఖాస్తులకు చివరితేది: 20.04.2024.
హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 22.05.2024
ప్రవేశ పరీక్షతేదీలు: 29.05.2024 నుంచి 31.05.2024 వరకు

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/

చదవండి: AP LAWCET/PGLCET 2024 Notification: ఏపీ లాసెట్‌/పీజీ ఎల్‌సెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

#Tags