Sound Engineering Courses: ఏయూలో సౌండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు

Andhra University (AU)లో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌండ్‌ ఇంజినీరింగ్, మ్యూజిక్‌ ప్రొడక్షన్, ఫిల్మ్‌ ఎడిటింగ్‌ కోర్సులను సెయింట్‌ లూక్స్‌ సంస్థతో సంయుక్తంగా ప్రారంభిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు.
ఏయూలో సౌండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు

అక్టోబర్‌ 28న ఏయూ అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో సౌండ్‌ ఇంజినీర్, స్టూడియో డిజైనర్‌ ఆదిత్య మోదీతో కలిసి కోర్సుల వివరాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. వీసీ మాట్లాడుతూ ఏయూ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతో పాటు, కళలకు సమాన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. ఏయూ నుంచి స్టూడియో ఏర్పాటుకు అవసరమైన భవనం అందిస్తామన్నారు. దీనిలో లూక్స్‌ సంస్థ అధునాతన డాల్బీ అట్మాస్‌ స్టూడియోను నిర్మిస్తుందన్నారు. ఏయూలో చదువుతున్న విద్యార్థులతో పాటు ఎవరైనా ఈ కోర్సులను అభ్యసించే అవకాశం ఉందన్నారు. 3, 6నెలలు, ఏడాది కాల వ్యవధితో ఈ కోర్సు ఉంటుందన్నారు. ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు సైతం ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఆదిత్య మోదీ మాట్లాడుతూ సౌండ్‌ ఇంజినీరింగ్‌కు ఎంతో డిమాండ్‌ ఉందని, ఈ రంగానికి అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే దిశగా యువతకు ఉపయుక్తంగా ఈ కోర్సు నిలుస్తుందన్నారు. సెయింట్‌ లూక్స్‌ సంస్థ వ్యవస్థాపకులు సంగీత దర్శకులు ఆశీర్వాద్‌ లూక్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలోని ఏయూలో డాల్బీ అట్మాస్‌ స్టూడియో నిర్మాణం జరుగుతోందన్నారు.

చదవండి: Andhra University: మధుమేహ వ్యాధిని గుర్తించేందుకు AU అద్భుత ఆవిష్కరణ.. ఒక స్ట్రిప్‌ ఆరు నెలల వినియోగం

విశాఖతో ఉపాధి అవకాశాలు: వీసీ 

పరిపాలనా రాజధానిగా విశాఖ మారితే విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలుంటాయని ఏయూ వీసీ ప్రసాద రెడ్డి అన్నారు. వర్సిటీ వ్యవస్థాపక కులపతి సీఆర్‌ రెడ్డి విశాఖను ‘సిటీ ఆఫ్‌ డెస్టినీ’ అని సంబోధించారని, నేడు అది నిజం అవుతోందన్నారు. విశాఖకు చిత్ర పరిశ్రమను ఆహ్వానించాలన్నారు. విశాఖలోని సముద్ర తీరం, చేరువలో ఉన్న మన్యం చిత్ర పరిశ్రమకు అనుకూలంగా నిలుస్తాయన్నారు. 

చదవండి: Professor Santhamma Inspiring Story: 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో... ప్రొఫెసర్‌ శాంతమ్మ!

#Tags