Engineering AI Course : బీటెక్‌ తొలి ఏడాది నుంచే ఏఐపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత.. ఈ రంగాల‌కు పెరుగుతున్న ప్రాధాన్య‌త‌..

జాతీయ స్థాయిలో.. బీటెక్‌ ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది! నిట్‌లు, ఐఐటీలతోపాటు రాష్ట్రాల స్థాయిలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో.. త్వరలోనే తరగతులు ప్రారంభంకానున్నాయి.

నేటి ఏఐ యుగంలో బీటెక్‌లో చేరిన లక్ష్యం నెరవేరాలంటే.. అందుకు తగ్గ లేటెస్ట్‌ టెక్నాలజీని, స్కిల్స్‌ను అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత!! ఇందుకోసం బీటెక్‌ మొదటి సంవత్సరం నుంచే కృషి చేయాల్సిన పరిస్థితి! ఈ నేపథ్యంలో.. ఇంజనీరింగ్‌లో తాజా ట్రెండ్స్, సంస్థలు కోరుకుంటున్న స్కిల్స్, వాటిని అందిపుచ్చుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం..  

బీటెక్‌లో ప్రవేశం కోసం ఎన్నో ఎంట్రన్స్‌లు రాసి సీటు సొంతం చేసుకున్న విద్యార్థులు.. కాలేజ్‌లో అడుగు పెట్టాక క్లాస్‌ రూమ్‌ తరగతులకే పరిమితం కాకుండా నూతన టెక్నాలజీ ట్రెండ్స్‌పై అవగాహన పెంచుకోవాలి.నిరంతరం మార్కెట్‌ ట్రెండ్స్‌ను తెలుసుకుంటూ..తాజా సాంకేతికను అనుసరిస్తూ.. వాటి­లో రాణించేందుకు కృషి చేయాలి. అప్పుడే జాబ్‌ మార్కెట్‌లో ముందంజలో నిలిచే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్‌లో చేరిన లక్ష్యం నెరవేరుతుంది.

Faculty Posts at NALSAR University : నల్సార్‌ యూనివర్శిటీలో 33 ఫ్యాకల్టీ పోస్టులు.. ఈ విభాగాల్లోనే..

మారుతున్న ధోరణి
నేడు సంస్థల కార్యకలాపాలు, వాటి దృక్పథంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన సాంకేతికతలను కంపెనీలు వేగంగా అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ విభాగాలు మొదలు కార్పొరేట్‌ సంస్థల వరకూ.. డిజిటలైజేషన్‌ ఆధారిత కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీటిలో నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా జెన్‌ ఏఐ, ఏఐ, డిజిటలైజేషన్, ఐఓటీ, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, రెన్యువబుల్‌ ఎనర్జీ, ఆర్‌ అండ్‌ డీ విభాగాలపై కంపెనీలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కాబట్టి వీటిని అందిపుచ్చుకునేలా విద్యార్థులు బీటెక్‌ మొదటి సంవత్సరం నుంచే కృషి చేయాలి.
జెన్‌ ఏఐ
ఇటీవల కాలంలో విస్తృతంగా వినిపిస్తున్న నూతన టెక్నాలజీ... జెన్‌ ఏఐ (జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌). టెక్స్‌›్ట, ఇమేజెస్, వీడియో, ఆడియో, సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లకు సంబంధించి క్లయింట్‌/యూజర్‌ అవసరాలకు అనుగుణంగా వాస్తవ కంటెంట్‌ను రూపొందించే టెక్నాలజీగా జెనరేటివ్‌ ఏఐ­ను పేర్కొంటున్నారు. మనకు ఇప్పుడు బాగా వినిపిస్తున్న చాట్‌ జీపీటీ, గూగుల్‌ బార్డ్‌ వంటివి జెనరేటివ్‌ ఏఐ కోవలోకే వస్తాయి. వీటిని ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, హెల్త్‌కేర్, తయారీ, ఫిన్‌టెక్, మీడియా, అడ్వర్టయిజింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. 2026 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్‌ల మంది జెనరేటివ్‌ ఏఐను వాడతారని అంచనా. అందుకే ఇంజనీరింగ్‌ విద్యార్థులు జె¯Œ  ఏఐ నైపుణ్యాల సాధనకు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

BECIL Contract Jobs : బీఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
ఇప్పుడు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత కార్యకలాపాలు విస్తృతం అవుతున్నాయి. ఈ కృత్రిమ మేథస్సుతో కార్యకలాపాలు సజావుగా సాగాలంటే.. సంబంధిత ప్రోగ్రామ్‌ల రూపకల్పనకు మానవ మేథస్సు చాలా అవసరం. ఫలితంగా రానున్న కాలంలో ఏఐ యువతకు బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌గా నిలవనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో రాణించేందుకు ప్రోగ్రామింగ్, కోడింగ్‌ నైపుణ్యాలు, మ్యాథమెటికల్‌ స్కిల్స్, అల్గారిథమ్‌ స్కిల్స్, లాజికల్‌ థింకింగ్, అనలిటికల్‌ స్కిల్స్‌ వంటి వాటిని మెరుగుపరచుకోవాలి.
డేటా సైన్స్, డేటా అనలిటిక్స్‌
కార్పొరేట్‌ రంగం మొదలు మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్‌ సెక్టార్, బ్యాంకింగ్‌.. ఇలా అన్ని రంగాల్లోనూ కార్యకలాపాల నిర్వహణలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న విభాగం.. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్‌. సంస్థలు బిగ్‌ డేటాపై ఆధారపడి వినియోగదారులను పెంచుకోవాలని కోరుకుంటున్నాయి. డేటా సైన్స్, మెషీన్‌ లెర్నింగ్, అనలిటిక్స్‌ విభాగాల్లో నైపుణ్యాలను సొంతం చేసుకున్న వారికి జాబ్‌ మార్కెట్‌లో డేటా ఇంజనీర్స్, డేటా అనలిస్ట్‌ ఉద్యోగాల్లో డిమాండ్‌ నెలకొంది.

Schools Holiday Due To Heavy Rains: భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు, మీకు మెసేజ్‌ వచ్చిందా?

ఐఓటీ
బీటెక్‌ విద్యార్థులు దృష్టి సారించాల్సిన మరో సాంకేతిక.. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌. ఇంటర్నెట్‌ లేదా వైర్‌లెస్‌ సెన్సార్ల ఆధారంగా ఆయా కార్యకలాపాలను పూర్తి చేసే ఈ సాంకేతికతను ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అమల్లోకి వస్తోంది. రిటైల్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్‌ అప్లయెన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లోని సంస్థలు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌కు విస్తృత ప్రాధాన్యం ఇస్తున్నాయి. తాజాగా ఇండస్ట్రియల్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కూడా ప్రా­ధాన్యం సంతరించుకుంటోంది. సంస్థలో ఒక ఉత్పత్తిని రూపొందించే క్రమంలో అన్ని విభాగాలను అనుసంధానం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇంజనీరింగ్‌ విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్, డేటా అనలిటిక్స్, అప్లికేషన్‌ డిజైన్, హార్డ్‌ వేర్‌ నెట్‌ వర్కింగ్, డాట్‌ నెట్, ఐపీ నెట్‌ వర్కింగ్‌ మొబైల్‌ డెవలప్‌మెంట్‌ వంటి అంశాలపై పట్టు సాధిస్తే చక్కటి కెరీర్‌ అవకాశాలు లభిస్తాయి.
సైబర్‌ సెక్యూరిటీ
ఈ–కామర్స్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్‌.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇంటర్నెట్‌ ఆధారిత ఆన్‌లైన్‌ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో.. అవి సాఫీగా సాగేలా.. వాటికి ముప్పు వాటిల్లని రీతిలో.. చర్యలు తీసుకునే సైబర్‌ సెక్యూరిటీకి కంపెనీలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో థ్రెట్‌ డిటెక్షన్, ఎథికల్‌ హ్యాకింగ్, డేటా ప్రొటెక్షన్‌ వంటి నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా ఆకర్షణీయమైన కెరీర్‌ అవకాశాలు దక్కించుకోవచ్చు.

Act Apprentice Training : ఆర్‌ఆర్‌సీ–నార్త్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు..

రెన్యువబుల్‌ ఎనర్జీ
జాతీయ స్థాయిలో పునరుత్పాదక శక్తి రంగంలో సుస్థిరత పెరిగేలా ప్రభుత్వ విధానాలు అమలు అవుతున్నాయి. రెన్యువబుల్‌ ఎనర్జీ, సోలార్‌ పవర్, ఎనర్జీ ఎఫిషియన్సీ విభాగాలు బీటెక్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. వీరు ఈ విభాగాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకుంటే పునరుత్పాదక ఇంధన రంగంలో అద్భుత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
ఆర్‌ అండ్‌ డీ
భారత్‌ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌పై దృష్టిసారిస్తోంది. ఇది రానున్న రోజుల్లోనూ మరింత వేగం పుంజుకోనుంది. ప్రస్తుతం ఆర్‌ అండ్‌ డీపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అనేక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రభుత్వ రంగ ఇన్‌స్టిట్యూట్స్, అదే విధంగా పరిశోధన లేబొరేటరీలు, కార్పొరేట్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌ వంటివి రీసెర్చ్‌ కార్యకలాపాల నిర్వహణకు సుమున్నత వేదికలుగా నిలవనున్నాయి. బయో టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఏరోస్పేస్‌.. ఇలా విభిన్న విభాగాలో రీసెర్చ్‌ చేసేందుకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

Today Schools Holiday Due to Heavy Rain 2024 : అత్యంత భారీ వర్షాలు.. స్కూల్స్‌కు సెల‌వు.. విద్యాశాఖ ప్ర‌క‌ట‌న‌

నైపుణ్య సాధనకు మార్గాలు
ఇంజనీరింగ్, సాంకేతిక విభాగాల్లో ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ వంటి తాజా నైపుణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. వీటిని పెంచుకునేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. పలు ఇన్‌స్టిట్యూట్స్‌ బీటెక్‌ స్థాయిలోనే ఏఐ–ఎంఎల్‌ బ్రాంచ్‌తో ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ ప్రవేశపెట్టగా.. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంటెక్‌ స్థాయిలో వీటిని అందిస్తున్నాయి. ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో కోర్సులతోపాటు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌కు సంబంధించి ఐబీఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్, వీఎం వేర్, ఇంటెల్‌ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఆటోమేషన్, ఐఓటీపై ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులు వీటి ద్వారా నైపుణ్యాలు పెంచుకోవచ్చు.
ఆన్‌లైన్‌ కోర్సులు
అంతర్జాతీయంగా పలు ప్రముఖ యూనివర్సిటీలు ఆయా టెక్‌ స్కిల్స్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ విధానంలో మూక్స్‌ పేరుతో కోర్సులను అందిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ విద్యార్థులు మూక్స్‌ ద్వారా తమ సబ్జెక్టులతోపాటు లేటెస్ట్‌ టెక్నాలజీపైనా అవగాహన పెంచుకోవచ్చు. మన దేశంలోనూ ఎన్‌పీటీఈఎల్‌ ద్వారా ప్రముఖ ప్రొఫెసర్స్‌ బోధించే పాఠాలను ఆన్‌లైన్‌లో వినే అవకాశముంది. వీటిల్లో విద్యార్థులకు ఉపయోగపడే వర్చువల్‌ ల్యాబ్స్‌ సౌకర్యం సైతం లభిస్తుంది. ఫలితంగా విద్యార్థులు తాజా పరిశోధనలు, టెక్నాలజీ, పరిణామాలు, ప్రాక్టికల్‌ అంశాలపై అవగాహన పెంచుకోవచ్చు.

Job Fair: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు... జాబ్ ఫెయిర్ లో ఇలా పాల్గొనండి!

నిరంతర అధ్యయనం
సాంకేతిక రంగంలో వస్తున్న తాజా మార్పులకు అనుగుణంగా శిక్షణ, నైపుణ్యాలతోపాటు నిరంతరం అధ్యయనం, పరిశీలన కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జెక్ట్‌ను చదవడానికే పరిమితం కాకుండా.. వాస్తవ పరిస్థితుల్లో అన్వయం చేసుకునే దృక్పథం చాలా అవసరమని పేర్కొంటున్నారు. 
అదే విధంగా.. ప్రాజెక్ట్‌ వర్క్, మినీ ప్రాజెక్ట్‌ వర్క్‌లు తాజా సాంకేతికతలకు సంబంధించినవిగా ఉండేలా చూసుకోవాలని ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సూచిస్తున్నారు. తద్వారా లేటెస్ట్‌ టెక్నాలజీస్‌పై అకడమిక్‌ దశలో ప్రాక్టికల్‌ నైపుణ్యాలు సొంతమవుతాయి. అదే విధంగా కొత్త టెక్నాలజీకి సంబంధించి ఇండస్ట్రీ వర్గాలు తీసుకుంటున్న చర్యలు, వాటిని అమలు చేస్తున్న తీరుపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలని, తద్వారా స్కిల్స్‌కు పదును పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 

#Tags