Skip to main content

Indian Population : 2036 నాటికి  భారత జనాభా 152 కోట్లు!

Indian population to be reach 152 crores in 2036 year

భారత దేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది. కేంద్ర గణాంకాలశాఖ ఆధ్వర్యం లోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన ’ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2023’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2011 జనాభా లెక్క­ల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8% మహిళలతో 152.2కోట్లకు చేరనుంది.

IIT Madras : ఐఐటీ–మద్రాసులో జల విజ్ఞాన కేంద్రం

ఇదే సమయంలో 15 ఏళ్ల లోపు వయసున్నవారి సంఖ్య కొంత తగ్గనుంది. సంతాన సాఫల్యం తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య భారీగా పెరగనుంది. దానివల్ల జనాభా పిరమిడ్‌లో 2036 కల్లా అనూహ్య మార్పులు రానున్నాయి. ఆ పిరమిడ్‌ లో ప్రాథమిక భాగం తగ్గిపోయి, మధ్య స్థాయి భాగం విస్తృతం కానుంది.
 

Published date : 21 Aug 2024 10:43AM

Photo Stories