Skip to main content

AP New Engineering Colleges List 2024 : 232 ఇంజినీరింగ్ కాలేజీల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌రుగుతున్న విష‌యం తెల్సిందే. ఇటీవ‌లే ఏపీ ఈఏపీ సెట్‌-2024 ఫలితాలను విడుదల చేశారు.
ap engineering colleges 2024

అలాగే ఉన్నత విద్యామండలి ర్యాంకులను కూడా ప్రకటించడంతో రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 

☛ AP Engineering Colleges Fee 2024-25 Details : ఈ ఏడాది ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల‌ ఫీజుల వివ‌రాలు ఇవే.. కనీస ఫీజు ఇంతే..!

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజినీరింగ్ కాలేజీల‌కు అనుమతులిస్తూ.. ప్రభుత్వం జులై 8న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇందులో 24 విశ్వవిద్యాలయాల కళాశాలలు, 208 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిని ఈ ఏడాది నుంచే.. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఏపీ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 8వ తేదీ నుంచి కోర్సులు, కాలేజీల‌ ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇది అందుబాటులోకి రాలేదు. కాలేజీల‌కు అనుమతుల జీవోను ఉన్నత విద్యాశాఖ జులై 8న ఇచ్చింది. 

చదవండి: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)

వీటిని కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు సమయం అవసరం కావడంతో వెబ్‌ ఆప్షన్లు ఇవ్వలేదు. జులై 9 నుంచి ఐచ్ఛికాలకు అవకాశం కల్పించేందుకు ఆన్‌లైన్‌లో ఫీజులు, కళాశాలల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇటీవ‌లే తెలంగాణ‌లో 200 ఇంజ‌నీరింగ్ కాలేజీల‌కు AICTE అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

 EAPCET Engineering Counselling 2024: టెక్నాలజీపై పట్టు సాధించాలని నిపుణుల సూచన... ఏ బ్రాంచ్ తో కెరీర్ బాగుంటుందంటే!

Published date : 09 Jul 2024 02:38PM

Photo Stories