Skip to main content

AP Engineering Colleges Fee 2024-25 Details : ఈ ఏడాది ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల‌ ఫీజుల వివ‌రాలు ఇవే.. కనీస ఫీజు ఇంతే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఇంజినీరింగ్ కాలేజీలు అడ్మిషన్లకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఏపీ ఈఏపీ సెట్‌-2024 ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి.. ర్యాంకులను ప్రకటించడంతో రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.
List of 210 B.Tech and two architecture colleges   AP EAPCET 2024 results announcement   AP Engineering Colleges Fee 2024-25 Details  Engineering college admissions in Andhra Pradesh

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జులై 7వ తేదీన (ఆదివారం) ఉత్తర్వులు ఇచ్చింది. 

ఫీజుల వివ‌రాలు ఇవే..
అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షల వ‌ర‌కు ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కోర్సులకు ఫీజులు నిర్ణ‌యించారు. అలాగే అత్యల్పంగా రూ.40 వేల చొప్పున నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల ఫీజు ఉన్న కళాశాలలు 114, రూ.లక్షపైన రుసుము ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్‌ కళాశాలలకు రూ.35 వేల చొప్పున ఫీజు ఖరారు చేశారు. 

☛ Engineering Counselling 2024:2024–25 విద్యా సంవత్సరంలో 66 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి

ఈ కాలేజీల్లోనే..
గుంటూరులోని ఆర్‌వీఆర్‌అండ్‌జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్‌ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్‌ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్‌ సిద్దార్థ, భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజి ఫర్‌ ఉమెన్ కాలేజీల‌కు రూ.1.05 లక్షల చొప్పున, విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలకు రూ.1.03 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజు రూ.93,700గా ఉంది.

చదవండి: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)

ఇత‌ర‌ ఖర్చులన్నీ..
ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ ఫీజుల కిందికే వస్తాయి. అదనంగా ఎలాంటి ఫీజుల‌ను కాలేజీలు వసూలు చేయకూడదు.

 Engineering Counselling 2024: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం

ఈ ఫీజులు త‌ప్ప‌..
వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్‌ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ఏరైన పైన చెప్పినవాటికి అద‌నంగా ఫీజులు వ‌సులు చేస్తే.. చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ పేర్కొన్నారు. 

 EAPCET Engineering Counselling 2024: టెక్నాలజీపై పట్టు సాధించాలని నిపుణుల సూచన... ఏ బ్రాంచ్ తో కెరీర్ బాగుంటుందంటే!

Published date : 09 Jul 2024 08:50AM

Photo Stories