Integrated B.Tech Courses After 10th: పదితోనే ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

బాసర ఆర్జీయూకేటీలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. జూన్‌1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వీ వెంకటరమణ తెలిపారు.

బాసరలోని ఆర్జీయూకేటీలో మొత్తం 1500 సీట్లున్నాయి. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన జీపీఏ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ఈ ఏడాది దరఖాస్తు విధానాన్ని ఎస్సెస్సీ బోర్డు సర్వర్‌తో అనుసంధానించారు.

EAMCET Counselling 2024 : ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఈ ఏడాది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం .....

దీంతో విద్యార్థి హాల్‌టికెట్‌ నెంబర్‌, పేరు వంటి వివరాలు నమోదు చేయగానే ఆటోమెటిక్‌గా వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 450, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలని వెంకటరమణ తెలిపారు. వివరాల కోసం www.rgukt.ac.in వెబ్‌సైట్‌ను, 7416305245, 7416058245,7416929245 హెల్ప్‌లైన్‌ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. 

పదో తరగతి మార్కుల ఆధారంగా..

పదో తరగతిలో పొందిన జీపీఏ(గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌) ఆధారంగా, ప్రతి సబ్జెక్టులోనూ విద్యార్థి పొందిన గ్రేడు ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్‌ను అనుసరించి ప్రవేశం కల్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రభుత్వ పాఠశాలలైన జిల్లా పరిషత్, మున్సిపల్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు సాధించిన మార్కులకు అదనంగా 0.4 జీపీఏ కలుపుతారు. అంటే.. ఓ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థికి 9.6 జీపీఏ వస్తే.. 0.4 జీపీఏ పాయింట్లు డిప్రివేషన్‌ స్కోరుగా అదనంగా కలపడంతో 10 జీపీఏ అవుతుంది. ఆర్‌జీయూకేటీలో రిజర్వేషన్ల ప్రకారం సీట్ల భర్తీ ఉంటుంది. మొత్తం సీట్లలో అన్ని కేటగిరీలలో బాలికలకు 33శాతం(1/3 శాతం) రిజర్వేషన్‌ విధానం అమలవుతుంది.

Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తులు ప్రారంభం: జూన్‌1, 2024
దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 22, 2024
వెబ్‌సైట్‌: https://www.rgukt.ac.in/
 

#Tags