Engineering: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అక్రమ డొనేషన్లను అరికట్టాలి

కాచిగూడ (హైదరాబాద్‌): ప్రైవేట్‌ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తివిద్యాకోర్సుల కాలేజీల్లో జరుగుతున్న అక్రమ డొనేషన్లను వెంటనే అరికట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ తదితర బీసీ సంఘాల ప్రతినిధులతో కృష్ణయ్య మే 24న‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రిని కలిసి చర్చలు జరిపారు. అక్రమాలకు పాల్పడుతున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు.

చదవండి: ECET Rankers: ఈసెట్‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించిన‌ పాలిటెక్నిక్ విద్యార్థులు..

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఒక్కొక్క కాలేజీ యాజమాన్యం కోర్సును బట్టి, కాలేజీ స్థాయిని బట్టి డొనేషన్ల కింద రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, దీన్ని వెంటనే అరికట్టాలని డిమాండ్‌ చేశారు.   

#Tags