IIIT Basara: ట్రిపుల్‌ ఐటీలో కృత్రిమ మేధస్సుపై అవగాహన సదస్సు

భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ విద్యలో కృత్రిమ మేధస్సు అనే అంశంపై న‌వంబ‌ర్‌ 4న అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

బాసర ట్రిపుల్‌ఐటీ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ చండీఘర్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా వారంరోజులు ఈ సదస్సు కొనసాగించనున్నారు. అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొంటారని అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రణధీర్‌ సాంగీ తెలిపారు.

చదవండి: AI Courses: పీయూలో త్వరలో కృత్రిమమేధా కోర్సులు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్‌లో కృత్రిమ మేధస్సు ఎలా ఉపయోగపడుతుంది, ప్రాజెక్టు నిర్వాహణ, వనరుల కేటా యింపులో ఎలా వినియోగించుకోవచ్చో చర్చిస్తార న్నారు. భద్రత వ్యవస్థలు డిజైన్‌ టూల్స్‌ తయారీ, ఆటోమేషన్‌ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌లో ఏఐ పాత్ర, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రొత్సహించ డం, తదితర అంశాలపై అధ్యాపకులు, విద్యార్థులు సంయుక్తంగా ఆలోచనలు పంచుకుంటారని వివరి ంచారు. సమన్వయకర్త డాక్టర్‌ రాకేశ్‌, పలు విభా గాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags