Artificial Intelligence: ఏఐతో సైబర్ సెక్యూరిటీకీ లాభాలు
విద్యుత్ పంపిణీ మొదలు కొని కీలక వ్యవస్థలపై సైబర్ దాడులు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయని నైబల్ అనే సెక్యూరిటీ సంస్థ సీఈవో నూర్ అల్‌హానస్ వ్యాఖ్యానించారు. కామ్‌టెల్ నెట్‌వర్క్స్ ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ చాలా సందర్భాల్లో సైబర్ దాడుల కంటే ముందు ఈ వ్యవస్థలపై భౌతి కంగా దాడులు జరుగుతాయన్నారు. దాడుల ను ముందే గుర్తించేందుకు ఏఐ ఉప యోగపడుతుందని, ఈ క్రమంలో వందల కోట్ల డాలర్ల ధనాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా ఈ వ్యవస్థలు హ్యాకింగ్‌కు గురైతే వచ్చే ప్రమాదా లను కూడా నివారించవచ్చన్నారు. 2021 సైబర్ దాడుల వల్ల ఒక్కో కంపెనీ దాదాపు 40 లక్షల డాలర్ల విలువను కోల్పోయినట్లు ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థలు తేల్చాయని క్రిటికల్ ఫ్యూచర్ సంస్థకు చెందిన ఆడమ్స్ రికోబోని పేర్కొన్నారు. రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో సైబర్ భద్రత ఒక శాతం మెరుగుపడినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 3600 కోట్ల డాలర్లు చేరుతుందన్నారు. కామ్‌టెల్ నెట్‌వర్క్స్ సీఎండీ శ్రీప్రకాశ్ పాండే మాట్లాడుతూ ఇంధన రంగంలో ఒక్కో సైబర్ దాడి విలువ దాదాపు 60 లక్షల డాలర్లని.. సెక్యురిటీని పటిష్టం చేస్తే భారీ మొత్తాలను ఆదా చేయొచ్చని క్రిటికల్ ఫ్యూచర్ సిద్ధం చేసిన శ్వేతపత్రం చెబుతోందన్నారు.
చదవండి: