TS EAMCET (Agriculture & Pharmacy) Top 10 Rankers : అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో.. టాప్‌-10 ర్యాంక‌ర్లు వీరే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించిన టీఎస్ ఎంసెట్‌–2022 పరీక్షల ఫ‌లితాలను విద్యాశాఖ ఆగ‌స్టు 12వ తేదీన(శుక్ర‌వారం) ఉద‌యం 11:15 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.
TS EAMCET (Agriculture and Pharmacy) Top 10 Rankers Details

ఈ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో విడుదల చేశారు. తెలంగాణ‌ ఎంసెట్‌ ఫలితాల్లో..  అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో.. 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో టాప్‌-10 ర్యాంక‌ర్ల‌లో ఒక ఏపీ నుంచే 7 మంది విద్యార్థులు ఉన్నారు. TS EAMCET Results 2022 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

➤ టీఎస్ ఎంసెట్‌-2022 (అగ్రికల్చర్) ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

☛ TS EAMCET-2022 (Agriculture) Results 2022 (Click Here)

TS EAMCET 2022 (Agriculture and Pharmacy) Top 10 Rankers :

ర్యాంక్ విద్యార్థి పేరు మార్కులు జిల్లా
1 JUTURI NEHA 154.141629 GUNTUR
2 VANTAKU ROHIT 153.900883 VISHAKAPATNAM
3 KALLAM TARUN KUMAR 153.114467 GUNTUR
4 KOTTAPALLI MAHEETH ANJAN 152.791152 Hyderabad
5 GUNTUPALLI SRIRAM 152.781677 GUNTUR
6 MUVVA NIVEDITHA 152.779126 KRISHNA
7 MITNALA SHIVA TEJASWINI 152.417384 KURNOOL
8 V S V SREE SHASHANK 152.124698 HYDERABAD
9 PRANEETH GANJI 151.815401 Hyderabad
10 VAJRALA DINESH KARTHIK 151.322827 GUNTUR

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

అగ్రికల్చర్ మాత్రం..
అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,150 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు ప‌రీక్ష‌లు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో జ‌రిగిన విష‌యం తెల్సిందే. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వ‌చ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండు రోజుల పాటు జ‌రిగిని 85.3 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు ఎంసెట్ కన్వీన‌ర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్‌ తెలిపారు. పరీక్షకు 80575 మంది హాజరయ్యారు.

టీఎస్ ఎంసెట్‌-2021 (ఇంజ‌నీరింగ్‌) కాలేజ్ & ర్యాంక్‌ ప్రిడిక్ట‌ర్ కోసం క్లిక్ చేయండి

#Tags