TS EAMCET 2022 Counselling Dates : టీఎస్ ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించిన టీఎస్ ఎంసెట్‌–2022 పరీక్షల ఫ‌లితాలను విద్యాశాఖ ఆగ‌స్టు 12వ తేదీన(శుక్ర‌వారం) ఉద‌యం 11:15 గంట‌ల‌కు విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
TS EAMCET Counselling 2022 Dates

తెలంగాణ‌ ఎంసెట్‌ ఫలితాల్లో..  అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో.. 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంజనీరింగ్‌ విభాగంలో 80.41 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ నేప‌థ్యంలో.. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కూడా  విడుదల చేసింది. మూడు విడతల్లో ఎంసెట్‌ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది.

➤ టీఎస్ ఎంసెట్‌-2022 (ఇంజనీరింగ్‌) ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

➤ టీఎస్ ఎంసెట్‌-2022 (అగ్రికల్చర్) ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

☛ TS EAMCET-2022 (Engineering) Results 2022 (Click Here)

☛ TS EAMCET-2022 (Agriculture) Results 2022 (Click Here)

Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

టీఎస్ ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..
☛ ఆగ‌స్టు 21 నుంచి ఆగ‌స్టు 29 వరకు ఆన్‌లైన్‌ స్లాట్ బుకింగ్
☛ ఆగ‌స్టు 23 నుంచి ఆగ‌స్టు 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
☛ ఆగ‌స్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు
☛ సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
☛ సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
☛ సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్
☛ సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
☛ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
☛ అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
☛ అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
☛ అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
☛ అక్టోబరు 11 నుంచి అక్టోబరు 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
☛   అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
☛   అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ

☛ చదవండి: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

ఎంసెట్‌కు భారీగానే..
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ మూడు రోజులు జ‌రిగిన ప‌రీక్ష‌ల‌కు తెలంగాణ‌, ఏపీ నుంచి 91 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఈసారి సకాలంలోనే నిర్వహించిన‌ ఎంసెట్‌కు భారీగానే పోటీ నెలకొంది. ఈ సారి ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. ప‌రీక్ష‌కు మాత్రం 1,56,812 మంది హాజ‌ర‌య్యారు.  TS EAMCET Keyని కూడా విడుద‌ల చేశారు.

Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

అగ్రికల్చర్ మాత్రం..
అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,150 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు ప‌రీక్ష‌లు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో జ‌రిగిన విష‌యం తెల్సిందే. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వ‌చ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండు రోజుల పాటు జ‌రిగిని 85.3 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు ఎంసెట్ కన్వీన‌ర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్‌ తెలిపారు. పరీక్షకు 80575 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కీ కూడా విడుద‌ల చేశారు.

#Tags