AP EAPCET 2022 Key : ఏపీ ఈఏపీసెట్ ప్రాథమిక కీ విడుదల.. ఈ సారి ఫలితాలు మాత్రం..!
ఇంజనీరింగ్ అభ్యర్థులు ఈ 'కీ' పై ఏమైన అభ్యంతాలు ఉంటే జూలై 14వ తేదీన (గురువారం) సాయంత్రం 5:00 గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా తెలపవచ్చును. అలాగే అగ్రికల్చర్ విద్యార్థులు జూలై 15వ తేదీన (శుక్రవారం) ఉదయం 9:00 గంటలోపు ఈ 'కీ' పై మీ అభ్యంతరాలను తెలపవచ్చును. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2022 పరీక్షలను జూలై 4వ తేదీన నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. ఏపీ ఈఏపీసెట్–2022 ఫలితాలు మాత్రం జూలై 3 లేదా 4వ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.
ఏపీ ఈఏపీసెట్–2022 పరీక్షల ప్రాథమిక 'కీ' కోసం క్లిక్ చేయండి
ఈ సారి భారీగా దరఖాస్తులు.. ఫలితాలు మాత్రం..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్‌కు 3,00,084 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఉండదు. సెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటించనున్నారు.
Check EAMCET 2021 College Predictor
Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!
☛ చదవండి: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..
☛ చదవండి: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..
☛ చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..
☛ చదవండి: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..