Free Coaching For DSC 2024 : గుడ్‌న్యూస్.. డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. వసతి కూడా..
ఈ నేపథ్యంలో డీఎస్సీ 2024కి ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వనున్నది. షెడ్యుల్డ్ కులాల అభ్యర్థులకు ఉచితంగా వసతితో కూడిన కోచింగ్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=scwel వెబ్‌సైట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 16 కేంద్రాలలో..
ప్రభుత్వ డైట్ (DIET), బి.ఎడ్ (B.Ed) కళాశాలలు ఉన్న జిల్లా కేంద్రాలతోపాటు.. ఎంపిక చేసిన మరికొన్ని జిల్లా కేంద్రాలను కలుపుకొని మొత్తం 16 కేంద్రాలలో ఒక్కోచోట 100 మంది చొప్పున షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రవేశ పరీక్ష & రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ఎంపిక చేస్తారు.
కోచింగ్ సమయం :
15.04.2024 నుంచి తేదీ 14.06.2024 వరకు దాదాపు రెండు నెలల పాటు డీఎస్సీ-2024కి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నారు. అభ్యర్థులు డైట్ (DIET), BEd పాస్ అయి ఉండాలి. అలాగే టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు : 12.03.2024 నుంచి 26.03.2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.