Skip to main content

TS DSC 2024 District Wise Posts Details : జిల్లాల వారీగా 11062 టీచర్ల‌ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ముఖ్య‌మైన తేదీలు ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఫిబ్రవరి 29వ తేదీన‌ డీఎస్సీ నోటిఫికేషన్ 2024ను విడుద‌ల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఈ నోటిఫికేష‌న్‌ను విడుదల చేశారు.
DSC Notification 2024 Released   Telangana DSC Notification Released by CM Revanth Reddy  ts dsc 2024 district wise posts list   Telangana Government DSC Notification 2024

మొత్తం 11062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఎస్జీటీలు 6,508, స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, , ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.

☛ School Assistant Exam 2024 Syllabus & Exam pattern : తెలంగాణ‌లో 2629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. సిల‌బ‌స్ ఇదే..

అత్యధికంగా పోస్టులు ఉన్న జిల్లా ఇదే..
హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 మాత్రమే ఉండగా…. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 176 ఉన్నాయి. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా.. ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు ఖాళీగా ఉంటే.. 137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.

ప‌రీక్ష కేంద్రాలు ఇవే..

ts dsc jobs 2024

తెలంగాణ డీఎస్సీ- 2024 ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది ఆన్‌లైన్‌ నిర్వహిస్తారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 1) మహబూబ్‌నగర్, 2) రంగారెడ్డి, 3) హైదరాబాద్, 4) మెదక్, 5) నిజామాబాద్, 6) ఆదిలాబాద్, 7) కరీంనగర్, 8) వరంగల్, 9) ఖమ్మం, 10) నల్గొండ మరియు 11) సంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..
ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్,  రాత‌ పరీక్ష కోసం చెల్లించాల్సిన రుసుము ఒక్కో పోస్ట్‌కు రూ.1000/- చెల్లించాలి. వేర్వేరు పోస్ట్‌లకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఒక్కో పోస్ట్‌కు విడిగా రూ. 1000/- రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ప్రతి పోస్ట్‌కు వేర్వేరు దరఖాస్తులను సమర్పించాలి. 

ముఖ్య‌మైన తేదీలు ఇవే..
మార్చి4 వ తేదీ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://schooledu.telangana.gov.in ఫీజు చెల్లింపు గేట్‌వే లింక్ ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ / నెట్-బ్యాంకింగ్ ద్వారా ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఏప్రిల్ 2వ తేదీతో ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయడానికి దశల వారీ విధానాన్ని మార్చి 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు. గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లుగా పేర్కొన్నారు.

☛ TS SGT Exam 2024 Syllabus & Exam pattern : 6,508 ఎస్జీటీలు పోస్టులు.. సిల‌బ‌స్ ఇదే.. ఈ సారి ప‌రీక్షా విధానం కూడా..

తెలంగాణ‌లోని జిల్లాల వారీగా 11062 టీచర్ల‌ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే..

Published date : 01 Mar 2024 10:31AM
PDF

Photo Stories