TG DSC Ranker Success Stories : ఒకే ఏడాదిలో.. ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టానిలా.. కానీ నేను మాత్రం...
మూడు నెలల క్రితం ప్రకటించిన గురుకుల ఫలితాల్లో జూనియర్ లెక్చరర్(తెలుగు), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)గా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు సాధించింది. ప్రస్తుతం ఆమె కీసర గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లోనూ వాణి స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)గా, లాంగ్వేజ్ పండిట్ (తెలుగు) పోస్టులకూ ఎంపికైంది. ఒకే ఏడాది ఐదు ఉద్యోగాలు సాధించిన వాణి ఆదర్శంగా నిలిచింది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఒకేసారి మూడు ఉద్యోగాలు కొట్టానిలా..
భూదాన్ పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన బండి యమున ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీతోపాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు సాధించింది. కాగా తండ్రి మల్లేశ్‌కు ముగ్గురు కుమార్తెలు.. యమున పెద్ద కుమార్తె. ఇంటర్ తరువాత డీఈడీ పూర్తి చేసింది. అనంతరం ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూనే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, బీఈడీ, పీజీ పూర్తి చేసింది.
నా భర్త ప్రోత్సాహంతో మూడు ఉద్యోగాలు సాధించానిలా..
లక్ష్య సాధనకు వైవాహిక జీవితం అడ్డుకాదని నిరూపించింది రామన్నపేటకు చెందిన గృహిణి గోరంట్ల పారిజాత. భర్త ప్రోత్సాహంతో డీఎస్సీ-2024లో స్కూల్ అసిస్టెంట్(తెలుగు), లాంగ్వేజ్ పండిట్, ఎస్టీటీ పోస్టులకు అర్హత సాధించింది. సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్(తెలుగు) విభాగంలో జిల్లాస్థాయిలో 16వ ర్యాంకు, లాంగ్వేజ్ పండిట్‌లో-13వ ర్యాంకు, సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో 24వ ర్యాంకు సాధించింది.