TG DSC Toppers Success Stories : ఈ కసితోనే చదివి నేను గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కొట్టా.. కానీ...
ఈ నేపథ్యంలో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సాధించిన వారి సక్సెస్ జర్నీ మీకోసం...
నా లక్ష్యం ఇదే.. : గడ్డం ప్రవళిక, వెంకటాపురం(కె)
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని చిన్న నాటి నుంచి ఉండేది. తల్లిదండ్రుల పోత్సాహంతో టీటీసీ, బీఈడీ పూర్తి చేశాను. టెట్‌లో కూడా 105 ర్యాంకు వచ్చింది. పట్టుదలతో చదివాను. ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు పాఠాలు భోదించి వారిని ఉన్నతస్థానంలో నిపాలన్నదే లక్ష్యం.
పేదరికం అడ్డుకాదు..
లక్ష్యంతో చదువుకుని ప్రభుత్వ కొలువు సాధించా. తన తండ్రి రామాదాసు ప్రభుత్వం పాఠశాలలో ఔట్ సోర్సింగ్‌లో స్వీపర్‌గా పని చేస్తూ చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా ఉద్యోగం సాధించాలని, చదువుకు పేదరికం అడ్డుకాదనే పట్టుదలతో చదవి ఉద్యోగం సాధించాను. తన తండ్రి కష్టానికి ఫలితంగా ఉద్యోగం సాధించాను.
– దాసరి అనూష, గోవిందరావుపేట
నా చిరకాల కోరిక నెరవేరింది..
ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనే చిరకాల కోరిక నెరవేరింది. క్రమశిక్షణతో చదువుకుని డీఈడీ, పీజీ పూర్తి చేశాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డీఎస్సీ పరీక్ష రాసి తెలుగు పండిట్‌గా ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉంది. పాఠశాలల్లోని విద్యార్థులను క్రమశిక్షణతో ఉన్నత స్థాఽనంలో నిలిపేందుకు కృషి చేస్తా.
– కావిరి రాజబాబు, బుట్టాయిగూడెం