Teacher Jobs: టెట్‌ నిర్వహించి టీచర్‌ పోస్టులు పెంచాలి

ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): టెట్‌ నిర్వహించి, టీచర్‌ పోస్టులు 11 వేల నుంచి 25 వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం చేపట్టిన ఉద్యమం తీవ్రతరమైంది.

సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 11న‌ పలు జిల్లాల నుంచి భారీ ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులు తరలిరావడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు చేపట్టిన ముట్టడి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాను 30 నుంచి 70 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: టెట్‌ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్‌ పేపర్స్ | TS TET ప్రివియస్‌ పేపర్స్

టెట్‌ పెట్టడానికి ఎలాంటి అవరోధాలు లేకపోయినా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు, నిరుద్యోగ జాక్‌ చైర్మన్‌ నీల వెంకటేశ్, తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు జి.అనంతయ్య అధ్యక్షతన జరిగిన ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు.  
 

#Tags