221 Teacher Jobs: ఉపాధ్యాయ ఖాళీలు 221

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో 221 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. కానీ, జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి.
ఉపాధ్యాయ ఖాళీలు 221

ఖాళీల స్థానంలో ఇటీవల ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఖాళీ సంఖ్య తగ్గించడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్‌ 15న టెట్‌

2017లో టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయగా ఈసారి పాత పద్ధతిలోనే డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ నిర్వహించి 17న ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఫలితాలు రాగానే డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే

2017లో టీఆర్‌టీ నిర్వహణ..

ఉపాధ్యాయ పోస్టులను ఆరేళ్లుగా భర్తీ చేయకపోవడంతో బీఈడీ, టీటీసీ పూర్తి చేసి టెట్‌ అర్హత సాధించిన వారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ భర్తీ చేయలేదు. తాజాగా ప్రభుత్వం గురువారం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 6612 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని డీఎస్సీ (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ) ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. అయితే అసెంబ్లీలో 13,500 పోస్టులు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం 6612 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఉపాధ్యాయ ఖాళీలు ఇలా..

స్కూల్‌ అసిస్టెంట్లు: 86

ఎస్‌జీటీ: 102

లాంగ్వేజి పండింట్‌: 27

పీఈటీ: 6

మొత్తం: 221

#Tags